మేలైన విత్తనాలపై అన్నదాతలకు రాష్ట్ర వ్యాప్త అవగాహన కార్యక్రమాలు
మేలైన విత్తనాలపై అన్నదాతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 24 న రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ మేళా జరగనుంది. జగిత్యాల, పాలెం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలు, 16 కృషి విజ్ఞాన కేంద్రాల్లో విత్తన మేళాలను నిర్వహించనుంది. అయితే… హైదరాబాద్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలంలో రేపు ఉదయం 10 గంటలకు ఇది ప్రారంభం అవుతంది. వ్యవసాయ పరిశోధనా మండలి సంస్థలు ఐఐఎంఆర్, ఐఐఓఆర్, ఐఐఆర్‌ఆర్‌తో పాటు వ్యవసాయ, ఉద్యానవన, పశువైద్య శాఖలు పాల్గొంటాయి.
రాష్ట్రవ్యాప్తంగా జరిగే విత్తన సదస్సుల్లో 16 పంటల్లో 67 రకాలకు సంబంధి దాదాపు 12 వేల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు విక్రయించేందుకు అందుబాటులో వుంచనున్నారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతపై రైతుల సందేహాలు కూడా తీర్చనున్నారు. ఇందుకోసం పంటల శాస్త్రవేత్తలతో చర్చ నిర్వహిస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన ప్రదర్శన కూడా వుంటుంది.రైతులను నకిలీ విత్తనాలపై అప్రమత్తం చేసి, మేలైన వంగడాలను అందించడానికే ఈ సదస్సులని విశ్వవిద్యాలయం అధికారులు పేర్కొన్నారు.