హనుమజ్జయంతి ర్యాలీపై రాళ్లదాడి

మధ్యప్రదేశ్ లోని గుణలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కర్నైల్‌గంజ్ ఏరియాలో హనుమాన్ జయంతి ఊరేగింపుపై ముస్లిం ఛాందసులు రాళ్లు రువ్వారు. దీంతో హిందువులకు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ సంజీవ్ కుమార్ సిన్హా కూడా ధ్రువీకరించారు. ప్రస్తుతం పరిస్థితి మాత్రం అదుపులోనే వుందన్నారు. సీసీటీవీ ఆఈధారంగా దుండగులను కూడా గుర్తించామని ప్రకటించారు. డీజే విషయంలో వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వాదన తర్వాత మసీదు నుంచి రాళ్లు రువ్వడం ప్రారంభమైంది. దీంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.
కాగా, ఈ ఘటనతో ప్రమేయమున్నట్టు భావిస్తున్న తొమ్మది మందిని ఇప్పటి వరకూ అరెస్టు చేసినట్టు గుణ పోలీస్ సూపరింటెండెంట్ సంజీవ్ కుమార్ షిండే తెలిపారు. ఘటనలో ప్రధాన నిందితుడు విక్కీ పఠాన్‌ను సైతం పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు నలుగురిపై ఎఫ్ఐఆర్ కూడా పోలీసులు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *