వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు
వక్ఫ్ సవరణ చట్టం -2025 లో కీలక ప్రొవిజన్ ను నిలిపేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. కనీసం ఐదేళ్ల పాటు ఇస్లాంను అనుసరించే వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం వుంటుందన్న దానిని నిలిపేసింది. ఓ వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్లు నిర్ణయించేలా నిబంధనలు తయారు చేసే వరకు ఇది అమల్లో వుండదని పేర్కొంది.
అదే సమయంలో వక్ఫ్ సవరణ చట్టంపై మొత్తంగా స్టే విధించడానికి సుప్రీం నిరాకరించింది. కొన్ని సెక్షన్లకు మాత్రం కొంత రక్షణ అవసరమని పేర్కొంది. అలాగే వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య కచ్చితంగా మెజార్టీలో వుండాలని కోర్టు పేర్కొంది. బోర్డ్ లేదా కౌన్సిల్ లో అత్యధికంగా ముగ్గురు లేదా నలుగురు ముస్లిమేతర సభ్యులు వుండాలని తెలిపింది. అంతేకాకుండా బోర్డు లేదా కౌన్సిల్ లో అత్యధికంగా ముగ్గురు లేదా నలుగురు ముస్లిమేతర సభ్యలు ఉండాలని కోర్టు తేల్చి చెప్పింది.అంతేకాకుండా బోర్డు లేదా కౌన్సిల్ లో అత్యధికంగా ముగ్గురు లేదా నలుగురు ముస్లిమేతర సభ్యలు ఉండాలని కోర్టు తేల్చి చెప్పింది.