రామ్ లల్లా నుదుట సూర్య కిరణం.. అయోధ్యలో అద్భుతం

యూపీలోని అయోధ్య ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో అద్భుతం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదుటిపై ‘‘సూర్య తిలకం’’ పడింది. దీనిని చూసి భక్తులు పరవశించిపోయారు. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఈ అద్భుతాన్ని చూసేందుకు, రాముడి దర్శనం కోసం విదేశాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు.
బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్య కిరణాలు పడేందుకు మూడో అంతస్తులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఓ వ్యవస్థనే రూపొందించి ట్రస్ట్. ఆలయ శిఖర భాగంలో సూర్యక్రాంతి గ్రహించేందుకు ఓ పరికరాన్ని కూడా ఏర్పాటు చేశారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ సూర్య తిలక వేడుకను నిర్వహించారు. మధ్యాహ్నం 12:00 గంటలకు ప్రారంభమై సుమారు కొన్ని నిమిషాల పాటు ఈ కాంతి తిలకం రామ్ లల్లాను ప్రకాశింపజేసింది. ఐఐటీ రూర్కీ శాస్త్రవేత్తల నేతృత్వంలో రూపొందించిన ఆప్టో-మెకానికల్ సిస్టమ్ ద్వారా సూర్య కిరణాలు నేరుగా విగ్రహంపై పడేలా ప్లాన్ చేశారు. సూర్య కిరణం రామ్ లల్లా నుదుటిపై పడగానే భక్తులు ‘జై శ్రీరామ్’ అంటూ చేసిన నినాదాలతో అయోధ్య నగరం మారుమోగిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *