వికసిత భారతానికి యువకుల వికాసమే మూలం : సతీష్ జీ
విద్యార్థులు వినూత్న ఆలోచనలతో ఉద్యోగాల కల్పన చేసే వ్యవస్థాపకులుగా ఎదిగినప్పుడే వికసిత భారతం సాధ్యమవుతుందని స్వదేశీ జాగరణ్ మంచ్ అఖిల భారతీయ సహ సంఘటనా మంత్రి సతీష్ అన్నారు.వికసిత భారతానికి యువకుల వికాసమే మూలమని పేర్కొన్నారు.స్వావలంబి భారత్ అభియాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని MLRIT కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. విద్యార్థులు తమ జీవితంలో స్వావలంబన సాధన ద్వారా మాత్రమే నిజమైన విజేతలుగా ఎదుగుతారని పేర్కొన్నారు. ఈ పోటీ ప్రపంచంలో సరైన క్రమశిక్షణ… సరైన ప్రణాళిక… లక్ష్యసాధన కోసం చేసే శ్రమ మాత్రమే విజయాలను సాధించి పెడుతుందని సూచించారు.
హోదాలకు వ్యత్యాసాలకు తావు లేకుండా కిందిస్థాయి నుండి విజయవంతమైన వ్యవస్థాపకులుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదిగి పై స్థాయికి చేరడం వలన వారితోపాటు పాటు సమాజ అభివృద్ధి కూడా సాధ్యమవుతుందని వివరించారు. ఉద్యోగాల సాధన కోసం మాత్రమే కాకుండా ఉపాధి కల్పించే వ్యవస్థగా ఎదిగినప్పుడే వికసిత యువత సాధ్యం అవుతుంది తద్వారా మాత్రమే వికసిత భారత స్వప్నం నెరవేరుతుందన్నారు.