ZOHO స్వదేశీ టెక్నాలజీ… స్వదేశీ మహా మంత్రం సమయంలో అందరి నోటా…
డిజిటల్ ఇండియాలో భాగంగా స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.ఇకపై విదేశీ సాఫ్ట్‌వేర్‌లను కాకుండా స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన జోహో ప్లాట్‌ఫామ్‌ను వాడాలన్న స్పృహ మెళ్లి మెళ్లిగా పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. స్వదేశీ వస్తువులనే వాడాలని, స్వదేశీ, స్వదేశీ అంటూ ప్రధాని మోదీ పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘‘జోహో ప్లాట్ ఫామ్’’ తెరపైకి వచ్చింది.
జోహో అనేది చెన్నైకి చెందిన ఒక ప్రముఖ టెక్నాలజీ సంస్థ. ఈ ప్లాట్‌ఫామ్‌లో డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌షీట్లు, ప్రజెంటేషన్లు వంటి ఆఫీస్ అప్లికేషన్స్‌తో పాటు అనేక వ్యాపార నిర్వహణ సాఫ్ట్‌వేర్లు కూడా ఉన్నాయి. సుమారు 180కి పైగా దేశాలలో లక్షలాది మంది వినియోగదారులు జోహో సేవలను ఉపయోగిస్తున్నారు. ఇది మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలకు గట్టి పోటీనిస్తోంది. జోహో సంస్థకు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. అది తమ యూజ్ల డేటాను చాలా జాగ్రత్తగా కాపాడుతుంది. యాడ్స్ కోసం డేటాను అమ్మకుండా వినియోగదారుల గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది.1996 లో శ్రీధర్ వెంబు, టోనీ థామస్ స్థాపించారు. ఈ సంస్థ 80 కి పైగా యాప్ లతో వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహిస్తోంది.
జోహో ఏమి చేస్తుంది?
సాఫ్ట్‌వేర్ సూట్: జోహో ఆఫీస్ సూట్, జోహో CRM (కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్), జోహో బుక్స్ (అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్), మరియు జోహో డెస్క్ (కస్టమర్ సేవ కోసం) వంటి అనేక క్లౌడ్-ఆధారిత సాధనాలను అందిస్తుంది.
వ్యాపార అవసరాలు: ఈ సాధనాలు చిన్న, మధ్యస్థ, మరియు పెద్ద వ్యాపారాలకు అవసరమైన వివిధ పనులు, అంటే ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్, మరియు కస్టమర్ సేవ, వంటివి సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడతాయి.
ఒకే ప్లాట్‌ఫారమ్: ఇది వెబ్, మొబైల్, మరియు డెస్క్‌టాప్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుంది, ఇది వ్యాపార కార్యకలాపాలను ఎక్కడ నుండైనా నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది.
డిజిటల్ పరివర్తన: జోహో సంస్థలు తమ కార్యకలాపాలను డిజిటల్‌గా మార్చుకోవడంలో సహాయపడే ఒక సమగ్ర పరిష్కారాన్ని అందిస్తుంది.
ఇప్పటికే జోహోను వాడుతున్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్
డిజిటల్ ఇండియాలో భాగంగా స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కేంద్ర రైల్వే, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తన అధికారిక పనులకు ఇకపై విదేశీ సాఫ్ట్‌వేర్‌లను కాకుండా స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన జోహో ప్లాట్‌ఫామ్‌ను వాడనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన సోషల్ మీడియాలో వెల్లడించారు.“నేను జోహోకి మారుతున్నాను – డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌షీట్లు, ప్రజెంటేషన్ల కోసం మన స్వదేశీ ప్లాట్‌ఫామ్ ఇది” అని ఆయన తన పోస్ట్‌లో తెలిపారు. విదేశీ సాఫ్ట్‌వేర్ సంస్థలకు దీటుగా భారతీయ కంపెనీలు సృష్టించిన టెక్నాలజీని ప్రోత్సహించడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.