కాలిఫోర్నియాలో హిందూ దేవాలయంపై దాడి
అమెరికాలోని కాలిఫోర్నియాలో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. హిందువులపై ద్వేషం చిమ్ముతూ దుండగులు BAPS హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. అలాగే దేవాలయం గోడలపై భారతీయులకు వ్యతిరేకంగా నినాదాలు రాశారు. ఈ దాడిని స్వామి నారాయణ సంస్థ బాధ్యులు కూడా ధ్రువీకరించారు. ఈ దాడి ద్వారా ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి దుండగులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
ఈ దాడిని తాము ఖండిస్తున్నామని బాధ్యులు ప్రకటించారు. ఇలాంటి సంఘటనలను ఎదుర్కొనేందుకు హిందూ సమాజం సంఘటితంగా, దృఢంగా వుందని పేర్కొన్నారు. హిందూ సమాజంపై తమకున్న ద్వేషాన్ని ఇలా దాడి రూపంలో వెళ్లగక్కారని పేర్కొంది. ద్వేషాన్ని సమాజం అంగీకరించదని, శాంతి, కరుణే ఎప్పటికైనా శాశ్వతమని ప్రతినిధులు ప్రకటించారు.ఇంత దాడి జరిగినా అక్కడి పోలీసు విభాగం మాత్రం ఇంకా ధ్రువీకరించలేదు. అధికారిక ప్రకటన కూడా విడుదల చేయకపోవడం శోచనీయం.
దాడిపై స్పందించిన భారత ప్రభుత్వం
కాలిఫోర్నియాలోని చినోహిల్స్‌లో హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసినట్టు వచ్చిన వార్తలు చూశాం. ఇలాంటి దుశ్చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇందుకు బాధ్యులైన వారిపై స్థానిక అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలిని డిమాండ్ చేస్తున్నాం. ప్రార్థనా స్థలాలకు తగిన భద్రత కల్పించాలని కూడా కోరుతున్నాం” అని విదేశాంగ శాఖ కార్యదర్శిా రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.