రోగుల్లోనూ, బీదజనంలోనూ శివుడ్ని చూడగలిగితే నిజంగా ఈశ్వరారాధన చేసినట్లే
మనం మన పవిత్రతను కాపాడుకుంటూ, ఇతరులకు మేలు చేయటమే మన ఆరాధనల్లోని సారాంశం. రోగుల్లోనూ, బలహీనుల్లోనూ, బీదజనంలోనూ శివుని చూడగలిగిన వారు ఈశ్వరారాధన నిజంగా చేసిన వారౌతారు. దేవాలయాల్లోని శివుని రూపాన్ని మాత్రమే దర్శించగల వ్యక్తి దైవారాధన చాలా ప్రాథమిక దశలో వున్నట్లుగానే పరిగణింపబడుతుంది. అలాగాక ఒక దీనజనుడ్ని సమీపించి, అతడు ఏ జాతికి, ఏ మతానికి, ఏ కులానికి చెందినవాడోననే వివక్షత లేకుండా అతనిలో శివుని దర్శించి అతనికి సేవలందించి, అతని దైన్యాన్ని నిర్మూలించే ప్రయత్నం చేసే వ్యక్తిని శివుడు ఎక్కువగా ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు.
– స్వామి వివేకానంద