గర్భా సంగీతాన్ని వింటున్న ఆరెస్సెస్ కార్యకర్తపై ముస్లిం ఛాందసుల దాడి
గుజరాత్ లో అనూహ్య సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ స్వయంసేవక్ తన కారులో గర్భా సంగీతాన్ని వింటున్నందుకు ఛాందసులు దాడి చేశారు. ఈ ఘటన జంఖంభాలియాలోని మదీనా మసీదు చౌక్ లో జరిగింది. ఇస్లాం ఛాందసులైన లాలాషేక్, రుస్తమ్ తో సహా వారి గుంపు స్వయంసేవక్ ను చుట్టుముట్టి, దాడి చేసింది. రెండు రోజుల క్రితం స్వయంసేవక్ తన స్నేహితుడ్ని మసీదు చౌక్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్లాడు. ఈ సమయంలోనే ఈ దాడి జరిగింది.
కారులో గర్భా సంగీతాన్ని వింటున్న సమయంలో ముస్లిం గుంపు కారులోంచి తనను బయటకి లాగి, దాడికి దిగారని బాధితుడు పేర్కొన్నాడు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. లాలాషేక్, రుస్తమ్ సహా మరో 30 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఇక… లాలాషేక్ మరియు రుస్తం తనను బాగా దుర్భాషలాడారని, అక్కడి నుంచి కదలొద్దని, కదిలితే మాత్రం చంపేస్తామని బెదిరించాడని స్వయంసేవక్ పేర్కొన్నాడు. ఎలాగో అలా తప్పించుకొని, తాను పీఎస్ కి వెళ్లినట్లు బాధితుడు తెలిపాడు.