స్వేచ్ఛ
ప్రపంచ చరిత్రలో, హిందూ ధర్మం మాత్రమే మానవ మనస్సుకి సంపూర్ణ స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని ఇచ్చింది, దానికి తన శక్తుల మీద పూర్తి ఆత్మవిశ్వాసం ఉంది. హిందూ ధర్మం అంటే స్వేచ్ఛ, ముఖ్యంగా భగవంతుని గురించి ఆలోచించడంలో పూర్తి స్వేచ్ఛ. ఎందుకంటే ప్రతి జీవిలో ఉన్న ఆత్మ భగవంతుని అంశ అని హిందుత్వం మాత్రమే చెపుతోంది. ఆ భగవంతుని ఇచ్ఛ ప్రకారమే ఈ ప్రపంచ కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ విషయాన్ని గ్రహించినది కాబట్టే హిందూధర్మంలో ఈ విశాలత్వం, స్వేచ్ఛ వచ్చాయి.