ఆయనే లేకపోతే….
‘ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిశాన్ నహి చెలేగా, నహి చెలేగా’ అంటూ జాతీయ సమైక్యత కోసం పోరాడారు డా.శ్యామ ప్రసాద్ ముఖర్జీ.
ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు అశుతోష్ ముఖర్జీ కుమారుడైన శ్యామ ప్రసాద్ రెండవసారి బెంగాల్ విభజన జరగకుండా అడ్డుకున్నారు. 1946లో కలకత్తా విశ్వవిద్యాలయ నియోజక వర్గం నుంచి బెంగాల్ అసెంబ్లీకి ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన ఆ తరువాత రాజ్యాంగ సభలో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించారు. దేశవిభజన సమయంలో కలకత్తాతోపాటు మొత్తం బెంగాల్‌ను తూర్పు పాకిస్తాన్‌లో కలపాలన్న ముస్లిం లీగ్ డిమాండ్‌ను ఆయన తీవ్రంగా వ్యతిరే కించారు. బ్రిటిష్ వాళ్ళు 1905లో ఇలాగే బెంగాల్‌ను విభ జించాలని చూసి నప్పుడు ప్రజలు ‘వందే మాతర ఉద్యమం’ ద్వారా ఎలా ఎదుర్కొన్నారో అందరికీ గుర్తుచేశారు. మళ్ళీ ఒకసారి బెంగాల్‌ను కాపాడుకునేందుకు బెంగాల్ ప్రజానీకం మరోసారి ఉద్యమిస్తారని హెచ్చరించారు శ్యామప్రసాద్.
దీనితో కాంగ్రెస్, ముస్లిం లీగ్‌తో పాటు బ్రిటిష్ ప్రభుత్వం కూడా వెనక్కు తగ్గి కేవలం ముస్లిం ఆధిక్య ప్రాంతాలనే తూర్పు పాకిస్తాన్‌లో కలిపింది.