పీఓకే అప్పగించడమన్న చర్చలే తప్ప.. వేరే చర్చలేమీ లేవు : ప్రధాని మోదీ

పీఓకే విషయంలో భారత్ మరోసారి తన వైఖరిని తేల్చి చెప్పింది. పొరుగు దేశంతో చర్చించాల్సిన ఏకైక విషయం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకె) తిరిగి అప్పగించే విషయంపై మాత్రమే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో తేల్చి చెప్పారు. కశ్మీర్ విషయంలో తమకు చాలా స్పష్టమైన వైఖరి వుందని, పీఓకే తిరిగి రావడం అన్న అంశమే మిగిలిపోయి వుందని మోదీ అన్నారు. పొరుగు దేశంతో ఇక మాట్లాడాల్సిందేమీ లేదన్నారు. అలాగే పీఓకే విషయంలో తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరమే లేదని మోదీ తేల్చి చెప్పారు. పాక్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసిన తర్వాత పాక్ డీజీఎంవోకి సమాచారం ఇచ్చామని, చర్చలకు సిద్ధంగా వున్నట్లు కూడా చెప్పామన్నారు. కానీ.. పాక్ నుంచే ఎలాంటి స్పందనా రాలేదని మోదీ తెలిపారు.

పాకిస్తాన్ ఒక వేళ దాడులకు దిగితే మాత్రం.. ప్రతిస్పందన అత్యంత దారుణంగా, వినాశకరంగానే వుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. భారత్, పాక్ ఉద్రిక్తతలు నడుస్తున్న నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే ప్రధాని మోదీ పై వ్యాఖ్యలు చేశారు. ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చితే పూర్తి స్థాయి యుద్ధానికి దారితీస్తుందని మోదీ తేల్చి చెప్పారు. పాక్ దాడులు చేయకుంటే తాము పూర్తి సంయమనంతోనే వుంటున్నామని, ఒకవేళ పాక్ దాడికి దిగితే మాత్రం ప్రతిస్పందన అత్యంత వినాశకరంగానే వుంటుందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు అమెరికా మీడియా తన కథనాల్లో పేర్కొంది

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *