‘‘టార్గెట్‌ లెస్  ప్లాంటేషాన్  ఆఫ్‌ ట్రీస్” ఉద్యమం నడుపుతున్న యువకుడు…

కొందరికి చెట్లన్నా, ప్రకృతి అన్నా వల్లమాలిన అభిమానం. చెట్ల సంపదకు ఏమాత్రం నష్టం  వాటిల్లినా… అసలు వారి మనస్సు  బాగోదు. చెట్లను కాపాడడానికి ఏమైనా చేస్టారు . ఓ యువకుడు ప్రతి రోజూ కాలేజీకి వెళ్తుండగా… గొడ్డలితో విచక్షణారహితంగా చెట్లను నరికేయడం రోజూ గమనిసస్త వుండేవాడు. వారి స్నేహితులందరూ  చాటింగ్‌లో బిజీగా వున్నా…ఈ అబ్బాయి మాత్రం గొడ్డలితో నరికివేయబడ్డ చెట్లనే దిగాలుగా చూస్తూ  తీవ్రంగా బాధపడేవాడు. దీంతో దేవేంద్ర అనే యువకుడు… ప్రకృతిపై ప్రేమతో వీలైనన్ని చెట్లను నాటడం, పెంచడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు . వెల్లూరు గ్రామంలో ఈ యువకుడు ఈ పని చేయడానికి ముందుకు వచ్చాడు. ఈ ఉద్యమానికి ‘‘టార్గెట్‌ లెస్  ప్లాంటేషాన్  ఆఫ్‌ ట్రీస్ (టీపీడీ)ని ప్రారంభించారు. బైపాస్  దగ్గర చాలా సంవత్సరాలుగా వున్న పెద్ద పెద్ద వృక్షాలను తమ స్వార్థ  ప్రయోజనాల కోసం విచక్షణారహితంగా కొట్టివేయడాన్ని చూస చలించిపోయి, ఈ నిర్ణయం తీసఱకున్నానని, ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తానని  ప్రకటించాడు.ఇదే తాను ప్రకృతికి ఇచ్చే ఓ బహుమతి అని గర్వంగా ప్రకటించుకున్నాడు. 2017 లో సవ్థపించిన ఈ సంస్థ  ఇప్పటి వరకు 50 వేలకు పైగా ఉచితంగానే మొక్కలను పంపిణీ చేస్తున్నారు . మదురై, తిరుచ్చి, శివగంగ, దిండిగుల్‌ జిల్లాలో ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం చేసఱ్తన్నాడు.

దేవేంద్రన్‌ కాలేజీ రోజుల్లో NSS లో  చురుగ్గా పనిచేసేవాడు . ఈ సమయం లోనే ప్రకృతిని కాపాడే ప్రతి కార్యక్రమంలోనూ చురుగ్గా వుండేవాడు. ఈ పనే ఆయన్ను ప్రకృతి ఆరాధకునిగా అయ్యేట్లు చేసింది . తన పాఠశాల ఆవరణలో ఓ మొక్కను నాటడానికి జిల్లా జడ్జీని ఆహ్వానించి, ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాడు, ప్రకృతిని కాపాడే మొట్ట మొదటి పని ఇదే. ఈ పనికి జిల్లా జడ్జి నుంచి విపరీతమైన ప్రశంసలు కూడా వచ్చాయి. ఈయన పనితనాన్ని చూసస, కేవలం పాఠశాలలోనే కాకుండా కోర్టు ఆవరణలో కూడా మొక్కలు పెంచాలని సూచించాడు.

ఇక డిగ్రీ పూర్తి చేససన తర్వాత దేవేంద్ర తనకున్న 1.5 ఎకరాల భూమిని నర్సరీగా మార్చాలని నిర్ణయించుకున్నాడు. అందుకు కుటుంబ సభ్యుల అనుమతి కూడా తీసుకున్నాడు. ఈ నర్సరీని  చూడడానికి వచ్చే వారికి ఉచితంగా మొక్కలను ఇవ్వడం ప్రారంభించాడు. అయితే కోవిడ్‌ సమయంలో నర్సరీ మూతపడిది. అయినా… ఎక్కడా ఆగలేదు దేవేంద్ర. తన మొక్కల పంపిణీని మాత్రం కొనసాగించాడు. పర్యావరణ కార్యకర్తలు, వాలంటీర్లు, సహకాంతో ఇతర నర్సరీల నుంచి మొక్కలను కొనుగోలు చేసి మరీ.. ఉచితంగా పంపిణీ చేశాడు. మొక్క బిడ్డ లాంటిది. మీరు దానిని నాటిన తర్వాత దానిని జాగ్రత్తగా చూసుకుంటూ పోషించుకుంటూ వెళితే.. మనలో చాలా తృప్తి వుంటుంది. కోర్టు ఆవరణలో నాటిన మొక్క పెద్దదైన తర్వాత చూస్తే.. ఓ బిడ్డను పెంచిన తండ్రిలా ఫీల్‌ అయ్యాను.. అని దేవ ప్రకటించాడు. అలాగే రైతులకు కూడా ఈ సాయం కొనసాగిస్తున్నాడు. రైతులకు కొబ్బరి మరియు మామిడి మొక్కలను అందజేస్తాడు. వచ్చే సారి కనీసం సంవత్సరానికి 12,000 చెట్లను నాటాలన్నది తన తపన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *