చామ ఆకు

చామ దుంపలు వాడి నంతగా చామ ఆకుని వంటకాల్లో వాడారు. దీనికి ప్రత్యేక కారణం ఏమి లేదు. చామ ఆకు ఉపయోగాలు :

–              చామ ఆకు కూర చాలా మంచిది. జబ్బుపడి లేచి నీరసపడిన వారికి ఈ ఆకుకూర చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

–              మూలశంక సమస్యతో బాధపడేవారు దీనిని లోపలికి తీసుకోవడం చాలా మంచిది

–              ఈ ఆకుకూర మూత్రాన్ని బాగా జారీచేస్తుంది.

–              అరుచి అంటే నోటికి రుచి తెలియకపోవడం వంటి సమస్యని నివారిస్తుంది.

–              ఆకలి పుట్టిస్తుంది.

–              ఈ చామ ఆకులను పులుసుకూరగా తినడం చాలా మంచిది.

–              ఈ ఆకుని పైన వేసి కట్టు కడితే గాయాలు మానుతాయి.

–              రక్తనాళాల నుంచి కారే రక్తం ఆగిపోతుంది.

గమనిక :

దీనిని అధికంగా తీసుకోవడం వలన శరీరంలో వాతం, శ్లేష్మంని కలిగిస్తుంది. దీనికి పులుసు విరుగుడు. అందువల్ల పులుసు కూర చేసుకోవడం వలన దీనిలో దుర్గుణాలు నశిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *