బ్రహ్మ దేవుడు రేపిస్ట్ అట.. శివుడు దేవుడే కాదట.. TCS లో రెచ్చిపోయిన ఛాందసులు
లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఫుడ్ జిహాద్ ఇవి విన్నాం. తాజాగా కార్పొరేట్ జిహాద్ కూడా వచ్చేంది. మహారాష్ట్ర నాసిక్ లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఒత్తిళ్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దీంతో కొంతమంది ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు పలువురు ఫిర్యాదుదారులు తమ వాంగ్మూలాలతో సహా ముందుకు వస్తుండటంతో కొత్త కొత్త విషయాలు., సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
వ్యవహారమంతా బయటకి వస్తుండటంతో బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో వారంతా బయటికి వచ్చి ఛాందసుల దుష్ట కార్యాల గురించి కుప్పలు తెప్పలుగా చెబుతున్నారు. తోటి ఉద్యోగులను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ, హిందూ దేవతలను తులనాడుతూ, ఇస్లాంను ప్రచారం చేస్తున్న విషయం కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది.
శివుడు గురించి, గణేషుడి గురించి, కృష్ణుడి గురించి పదే పదేవ అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని పలువురు ఫిర్యాదులు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా ఓ బాధితురాలు తన ఫిర్యాదులో ఇలా పేర్కొన్నారు. ‘‘గత యేడాది మే మాసంలో నేను ఎప్పటిలాగే సోమవారం ఉపవాసం ఉంటున్నాను. నేను శివుని భక్తురాలిని కాబట్టి నా టేబుల్ పై ఈశ్వరుడి విగ్రహం పెట్టుకుంటాను. ఆ సమయంలో, అక్కడ ఉన్న తౌసిఫ్ అత్తర్ విగ్రహం వైపు చూస్తూ ఇలా ప్రశ్నించాడు: ‘మహాదేవుడు నిజంగానే దేవుడా? పార్వతి గ గణేశుడిని సృష్టించినట్లయితే, ఆ విషయం మహాదేవుడికి ఎందుకు తెలియదు? గణేశుడు మహాదేవుడి కుమారుడు ఎందుకు అవుతాడు?’ అని అంటూ, అతను పార్వతీదేవి శీలాన్ని ప్రశ్నించే రీతిలో మాట్లాడాడు.బ్రహ్మదేవుడు ఓ రేపిస్ట్. తన సొంత కుమార్తెనే అత్యాచారం చేశాడు. శివుడు దేవుడే కాదు.’’ అలాగే రాముడు వనవాసం సమయంలో రాముడు, సీత కచ్చితంగా మాంసాహారం భుజించే వుంటారు. అలా చేయకుంటే వారు బతికేవారే కాదు. అప్పుడు నేను దీనికి ఆధారం ఏంటని ప్రశ్నించాను. ఇది నా సొంత వ్యాఖ్యమే అంటూ తౌసిఫ్ సమాధానం చెప్పాడు’’ అని ఫిర్యాదుదారు వెల్లడించింది.
అలాగే నిందితుడు తౌసిఫ్ తన ఇస్లాంను గొప్పదిగా చేసి చూపుతూ, మరో మతాన్ని కించపరిచేవాడని కూడా ఫిర్యాదుదారు చెప్పుకొచ్చింది. ఇస్లాంను ఉన్నతంగా చూపిస్తూ, హిందూమతాన్ని కించపరిచేవాడని, ఎప్పుడూ హిందూ మతాన్ని కించపరుస్తూ ‘కనిపించనివాడే నిజమైన దేవుడు. హిందూ ధర్మంలోని దేవుళ్ళు కనిపిస్తారు కాబట్టి, వారు దేవుళ్లే కాదు’’ అంటూ కించపరిచేవారని, హిందూ దేవీ దేవతల ఉనికిని కూడా తరుచూ ప్రశ్నించేవాడని వెల్లడించింది.