తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొంటాం : తెలంగాణా ప్రభుత్వం ప్రకటన
రైతులకు నష్టం జరగకుండా చివరి గింజ వరకూ కొంటామని తెలంగాణ ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చింది. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే సేకరించాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా పై నిర్ణయం తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు పూర్తి బాధ్యత జిల్లా కలెక్టర్లకే అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కనీస మద్దతు ధర కంటే ఒక్క రూపాయి కూడా తక్కువ చెల్లించమని, రాష్ట్రానిక అవసరమైన సన్న బియ్యం అంత రాష్ట్రంలోనే సేకరిస్తామని మంత్రి తెలిపారు. సన్న వడ్లకు క్వింటాల్‌కి 500 రూపాయల బోనస్ ఇస్తామని, నకిలీ విత్తనాల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.