సేంద్రీయ సాగు విస్తృతి పెరగాలి : గవర్నర్ జిష్ణుదేవ్
మెదక్ జిల్లాలో సేంద్రియ సాగు పై రైతులకు అవగాహన కల్పించడంలో తునికి కృషి విజ్ఞాన కేంద్రం ఏకలవ్య ఫౌండేషన్ సేవలు మరువలేనివని గవర్నర్ విష్ణుదేవ్ వర్మ అన్నారు. ఉపరాష్ట్రపతి తో కలిసి గవర్నర్ తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన రైతు ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొని మాట్లాడారు. ఆర్గానిక్ సాగు చేస్తున్న 800 మంది రైతులు ఈ సమ్మేళనం లో పాల్గొనడం ఆనందంగా ఉంది అన్నారు. దేశంలో రైతులు మళ్ళీ ఆర్గానిక్ సాగు దిశగా అడుగులు వేస్తున్నారు. రసాయనిక సాగును క్రమక్రమంగా తగ్గిస్తున్నారు. ఏకలవ్య ఫౌండేషన్, కేవికె సంస్థ ఆర్గానిక్ సాగు దిశలో రైతులకు మేలైన సహకారం అందిస్తున్నదడం పట్ల అభినందించారు. రాబోయే రోజుల్లో మరింతగా ఆర్గానిక్ సాగు విస్తృతికి కృషి అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి, ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ సివి రావు,తెలంగాణ రాష్ట్ర ఆర్ఎస్ఎస్ చీఫ్ బాలయ్య, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందా నాయక్ తదితరులు పాల్గొన్నారు.