‘‘యూరియా యాప్’’ లో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం
యూరియా కోసం తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ‘‘యూరియా యాప్’’ లో కీలక మార్పులు రాబోతున్నాయి. ఇప్పటి వరకూ జిల్లా యూనిట్ గా దీని పంపిణీ జరగ్గా.. ఇక నుంచి మండలం లేదా రెండు మండలాలు లేదా నియోజకవర్గ ప్రాతిపదికన ఈ పంపిణీ జరుగుతుందని వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఆ మేరకు యాప్ లో మార్పులు చేస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా యూరియా పంపిణీ సరిగ్గా నిర్వహించని ప్రైవేట్ డీలర్లపై కూడా నిఘా పెట్టామని పేర్కొన్నారు.
ప్రస్తుతం జిల్లా యూనిట్ గా యూరియా పంపిణీ జరుగుతోంది.అయితే.. రైతులు యాప్ లో తమ జిల్లాల పరిధిలోని దుకాణాలను బుకింగ్ చేసుకుంటున్నారు. దీని కారణంగా జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో విపరీతంగా రద్దీ ఏర్పడుతోంది. దీని కారణంగా యూరియా నిల్వలపై సమాచారం నమోదు అవ్వడంలో ఇబ్బందులు వస్తున్నాయి. వీటన్నింటినీ పరిశీలించిన అధికారులు తాజా మార్గదర్శకాలను రూపొందించారు.