టీటీడీ బోర్డు తరహాలోనే యాదిగిరి గుట్టలోనూ బోర్డు
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తరహాలోనే యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు వేగంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అయితే బోర్డు ఏర్పాటులో రాజకీయాలు లేకుండా చూసుకోవాలన్నారు. యాదగిరి గుట్ట ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. అంతేకాకుండా ఆలయం పక్షాన ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలని, దీనిపై దృష్టి సారించలన్నారు. అయితే ఈ ధర్మకర్తల మండలిలో ఎవరెవర్ని తీసుకోవాలి? ఏయే రంగాల నుంచి తీసుకోవాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. టీటీడీ మాదిరిగానే ఇక్కడ కూడా ఇతర రాష్ట్రాల వారిని కూడా తీసుకుంటారా? అన్న దానిపై స్పష్టత రాావాల్సి వుంది.