రుణ మాఫీకి మార్గదర్శకాలను విడుదల చేసిన తెలంగాణా ప్రభుత్వం…

పంటల రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది., కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ ప్రకటించింది. 2018 డిసెంబర్‌ 12 నుంచి 2023 డిసెంబర్‌ 13 వరకు తీసుకున్న పంట రుణాల బకాయిలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుందని, రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్‌కార్డు ప్రామాణికమని స్పష్టం చేసింది. మరోవైపు ఈ పంట రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ ఏర్పాటు చేయనున్నారు. రుణమాఫీ నగదు నేరుగా లబ్ధిదారుల రుణఖాతాల్లోనే జమకానుంది. ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ మార్గదర్శకాలు ఇలా వున్నాయి.

1. తెలంగాణలో భూమి కలిగి వున్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల పంట రుణమాఫీ వర్తిస్తుంది.
2. స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది.
3. రాష్ట్రంలో వున్న షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వాటి బ్రాంచుల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
4. 12 డిసెంబర్‌ 2018 తేదీన లేదా తర్వాత మంజూరైన లేక రెన్యువల్‌అయిన రుణాలకు మరియు 9 డిసెంబర్‌ 2023 తేదీ నాటికి బకాయి వున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
5. ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబం 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీకి అర్హుల. 9 డిసెంబర్‌ 2023 నాటికి బకాయి వున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
6. వ్యవసాయ శాఖ కమిషనర్‌, సంచాలకులు పంట రుణమాఫీ 2024 పథకాన్ని అమలు చేసే అధికారిగా వుంటారు.
7. వ్యవసాయ శాఖ సంచాలకులు, ఎన్‌ఐసీ సంయుక్తంగా ఈ పథకం అమలు కోసం ఓ ఐటీ పోర్టల్‌ను నిర్వహిస్తారు. ఈ పోర్టల్‌లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోక్‌ అకౌంట్‌ డేటా సేకరణ, డేటా వాలిడేషన్‌, అర్హత మొత్తాన్ని నిర్ణయించానికి వుంటుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *