జూన్ మొదటి వారంలో తెలంగాణలోకి ఋతుపవనాలు
తెలంగాణకు చల్లని కబురు… పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 22 నాటికి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది వాయువ్య దిశలో కదిలి ఈ నెల 24 నాటికి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం వుందని చెప్పింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
మరోవైపు నైరుతి రుతుపవనాలు మాల్దీవుల్లో కొంతవరకు, దక్షిణ బంగాళాఖాతం నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలని కొన్ని ప్రాంతాల వరకి విస్తరించాయని పేర్కొంది. దక్షిణ అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. ఈ నెల చివరి వరకు కేరళని తాకి, జూన్ మొదటి వారంలో తెలంగాణలోకి ప్రవేశించే ఛాన్స్ వుందని పేర్కొంది. ఇక.. హైదరాబాద్ నగరంలో పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిపింది. రాష్ట్రంలో సగటున 36 నుంచి 41 డిగ్రీల మేర గరి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది.