తెలంగాణా బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి 72,659 కోట్ల కేటాయింపు
తెలంగాణ ప్రభుత్వం 2024`2025 వార్షిక బడ్జెట్‌ను తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క 2,91,159 కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో రెవిన్యూ వ్యయం 2,20,945 కోట్లు కాగా.. మూలధన వ్యయం 33,487 కోట్లుగా ప్రతిపాదించారు. అయితే.. అత్యంత కీలకమైన వ్యవసాయ రంగానికి 72,659 కోట్లను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. వ్యవసాయ రంగాన్ని మరింత లాభసాటిగా మార్చే ఆలోచనతో తాము పలు రకాల సంక్షేమ పథకాలను ప్రకటించినట్లు తెలిపారు.
ఇక.. భూమిలేని రైతు కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ యేడాది నుంచే ఈ పథకం అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు. ఇలా వారికి సాయం అందించడం ద్వారా వారికి లాభమవుతుందని తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇక.. 33 రకాల సన్నవడ్లు పండిరచే రైతులకు క్వింటాల్‌కి 500 రూపాయల బోనస్ ప్రకటించారు. ఇది కూడా ఈ యేడాది నుంచే అమలు చేస్తామన్నారు. దీని ద్వారా వరి పంటను లాభసాటిగా మార్చడానికి వీలవుతుందన్నారు. సన్నరకం వడ్లు పండిరచే రైతులకు ఆర్థిక ప్రయోజనం కూడా వుంటుందని తెలిపారు.
ఇక… కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి సఫల్ యోజన పథకంలో రైతులను చేరుస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ బీమా పథకం కింద రైతులు చెల్లించాల్సిన ప్రీమియం డబ్బులను ప్రభుత్వం చెల్లిస్తుందని, పైసా ఖర్చు లేకుండా రైతుకు పంట భద్రత కల్పిస్తామన్నారు.
ఇక… రుణమాఫీ కోసం 31 వేల కోట్లు సమీకరిస్తున్నామని, త్వరలోనే పూర్తి స్థాయి రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. లక్ష వరకు రుణం వున్న 11.34 లక్షల రైతులకు రుణమాఫీ చేశామని, 2 లక్షల వరకు రుణం వున్న రైతులకు త్వరలోనే మాఫీ అవుతుందన్నారు. రైతు భరోసా కింద ఎకారకు 15 వేలు ఇవ్వాలన్నది తమ సంకల్పమని, త్వరలో భూమి లేని రైతులకు యేటా 12 అందిస్తామన్నారు.