”మన గ్రామం – మన బాధ్యత” పేరుతో పంట కాలువల పూడిక తీత చేపట్టిన ప్రవాస భారతీయులు

వ్యవసాయ సీజన్‌ వచ్చేస్తోంది. దీంతో రైతులకు ఇబ్బందులు లేకుండా వుండేందుకు ప్రవాస భారతీయులు  ఓ అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టింది. మాతృ భూమి ఫై ఉన్న మమకారం చాటుకున్నారు.  మన గ్రామం` మన బాధ్యత’’ అనే కార్యక్రమం కింద పంట కాలువలలో పూడిక తీత పనులను చేపట్టారు. బాపట్ల జిల్లా బల్లికురవ, కొత్తపాలెం గ్రామాలకు చెందిన కాలువల పూడిక కార్యక్రమాన్ని చేపట్టారు. తమకు ఎదురవుతున్న ఇబ్బందులను స్థానిక రైతులు అమెరికాలో స్థిరపడిపోయిన రాజేంద్ర అనే వ్యక్తి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మన గ్రామం… మన బాధ్యత అనే కార్యక్రమంతో పంట కాలువల పూడిక తీత పనులను  వారు ప్రారంభించారు.

ఇందులో గ్రామ రైతులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయుడు బాపయ్య మాట్లాడుతూ… తాము అమెరికాలో స్థిరపడినా… తాము పుట్టిన గ్రామాలపై మమకారం చాలా వుంటుందని, కొన్ని రోజులుగా గ్రామీణ క్షేత్రాల్లో ఎక్కువగా సేవలందిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. గుంటుపల్లి నుంచి కొత్తపాలం వరకు సాగర్‌ నీరు వచ్చే పంట కాలువను అభివృద్ధి పరిచి, 250 ఎకరాలకు సక్రమంగా నీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీని ద్వారా రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తామని ప్రకటించారు. అలాగే రోడ్లపై వుండిపోయిన తుమ్మ చెట్లను కూడా తొలగిస్తామన్నారు. తమ పంట కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టి, తమకు ఆసరాగా నిలబడిన నూతి బాపయ్యను గ్రామంలోని రైతులందరూ సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *