తిరుమంగళం దేవాలయంలో 10 దేవతా విగ్రహాల ధ్వంసం

తమిళనాడులోని తిరుమంగళంలోని పళనియపురం ఎజుపెరు స్వామి దేవాలయంలో రెండు రోజుల క్రితం హిందూ దేవాలయంపై దాడి జరిగింది. సుమారు 10 దేవతా మూర్తులను దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని హిందువులు, హిందూ మున్నాని సంస్థ తీవ్రంగా పరిగణించింది. నిందితులను వెంటనే గుర్తించి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యక్తి మానసిక స్థితి బాగోలేదని, మద్యం మత్తులో చేశాడన్న సాకులు తమకు చెప్పవద్దని, వెంటనే నిందితుడ్ని అరెస్ట్ చేయాలని హిందువులు డిమాండ్ చేశారు.వంశపరంగా వచ్చే ధర్మకర్తలతో నడుస్తున్న ఈ దేవాలయంలో అయ్యర్ స్వామి, పెరియ కరుప్ప స్వామి, మాయాండి, రక్కచ్చి అమ్మన్, చిన్నస్వామి, ఆండి సామి మొదలైన మూర్తులతో పాటు మొత్తం 20 దేవతా విగ్రహాలున్నాయి.
ఈ నెల 26 న కొంత మంది దుండగులు ఆలయ తలుపులు పగులగొట్టి, ఈ దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. అనేక విగ్రహాలను ఛిన్నాభిన్నం చేయడంతో పూర్తిగా విరిగిపోయాయి. స్థానికుల సమాచారం ప్రకారం పది దేవతా విగ్రహాలు దెబ్బతిన్నాయి. అలాగే గంటను కూడా దొంగలించారు. దీంతో తిరుమంగళం భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సీసీ టీవీలను పరిశీలించారు.
దీనిపై హిందూ మున్నాని సంస్థ స్పందించింది. తమిళనాడులో దేవతా విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే వుందని, నిందితులను పట్టుకోకుండా పోలీసులు సాకులు చెబుతున్నారని మండిపడింది. స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ విషయంలో చాలా ఉదాసీనంగా వుందని ఆరోపించారు. దీంతో స్థానికులు తిరుమంగళం పీఎస్ లో ఫిర్యాదు చేశారు. నేరస్థులను గుర్తించడంలో పోలీసులు విఫలం అవుతున్నారని, అలసత్వం వహిస్తున్నారన్నారు. ఎప్పటి లాగే నిందితుల మానసిక పరిస్థితి బాగోలేదన్న రొటీన్ డైలాగ్స్ చెబుతున్నారని హిందూ మున్నాని మండిపడింది. పోలీసుల వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, పోలీసులు కుంటి సాకులు చెప్పడం మానేసి, నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *