అమృత్‌కు 10 సంవత్సరాలు…. మారిన నగర ముఖచిత్రం
నగరాల్లో జీవన నాణ్యతను మెరుగుపరచడానికి తీసుకు వచ్చిన ఓ ప్రధాన కార్యక్రమం ‘అటల్ మిషన్ ఫర్ రిజూవినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్’ (ఏఎంఆర్‌యూటీ.. ‘అమృత్’). దీనిని ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని భారత్ పండుగ చేసుకొంటోంది. ఈ మిషన్‌ను 2015 జూన్ 25న మొదలుపెట్టారు. నీటి సరఫరా, మురుగు పారుదలకు ఒక సజావైన వ్యవస్థ, పట్టణ ప్రాంతాల్లో రవాణా.. వీటితో పాటు పార్కుల వంటి మౌలిక సేవలను సమకూర్చడం దీని లక్ష్యం .
ఇది ప్రజలకు, మరీ ముఖ్యంగా పేదలకు మెరుగైన సేవలను అందించడం కోసం మౌలిక సదుపాయాల కల్పనపై తన దృష్టిని కేంద్రీకరించింది. నీటి సరఫరాకు, మురుగునీటి పారుదలకు అగ్రప్రాధాన్యాన్ని ఇచ్చారు. బాలలు, వయోవృద్ధులు ఉపయోగించుకొనే పార్కులను ఏర్పాటు చేయడానికి ప్రాజెక్టు వ్యయంలో 2.5 శాతం వరకు ఖర్చు పెట్టడానికి అనుమతించారు.
ఎంపిక చేసిన 500 నగరాలు, పట్టణాలను ఈ మిషన్ పరిధిలోకి తీసుకువచ్చారు. (వీటిలో 485 నగరాలే కాకుండా విలీనం చేసిన నగరాలు 15 కూడా కలిసి ఉన్నాయి.) ఇది కేంద్రం ప్రాయోజితం చేసే పథకం. దీని నిధులను పట్టణ జనాభా, పట్టణాల సంఖ్య ఆధారంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య పంచుతారు.
ఈ మిషన్‌లో భాగంగా, రూ.77,640 కోట్లు ఖర్చయ్యే రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళికలను (ఎస్ఏఏపీస్) ఆమోదం తెలిపారు. ఈ మొత్తంలో కేంద్ర సాయం రూ.35,990 కోట్లు కూడా కలిసి ఉంది. ఇంతవరకు, రూ.79,401 కోట్ల పనులు పూర్తి అయ్యాయి. రూ.72,656 కోట్లు ఖర్చుచేశారు.
అటల్ మిషన్ ఫర్ రిజూవినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (ఏఎంఆర్‌యూటీ.. ‘అమృత్’) ఉద్దేశాల్లో ఈ కింది చర్యలు భాగంగా ఉన్నాయి.
* ప్రతి కుటుంబానికి నల్లా నీరు పక్కాగా అందుబాటులో ఉండేటట్టు చూడటంతో పాటు మురుగు పారుదల సదుపాయాన్ని కల్పించడం;
* పచ్చదనంతో కళకళలాడే ప్రదేశాలను తీర్చిదిద్ది, ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దిన బహిరంగ స్థలాలను (పార్కులు వంటివి) అంతే చక్కగా నిర్వహిస్తూ, నగరాల్లో వసతి సౌకర్యాల విలువను పెంచడంతో పాటు,
* సార్వజనిక రవాణాకు మళ్లడంతో పాటు మోటార్ల అవసరం ఉండని తరహా రవాణా సాధనాలకు (ఉదాహరణకు కాలి నడక, సైకిల్ సవారీ వంటి వాటికి) అనువుగా తగిన సదుపాయాల నిర్మాణం చేపట్టి కాలుష్యాన్ని తగ్గించడం.
ప్రయోజనాలు
‘అమృత్’ కాంపొనెంట్లలో.. సామర్థ్యాన్ని పెంచే కార్యక్రమాలతోపాటు సంస్కరణలను అమలుచేయడం, నీటి సరఫరా, మురుగు, సెప్టిక్ ట్యాంకుల్లో పోగుపడే ఘన వ్యర్థాలు, ద్రవరూప వ్యర్థ పదార్థాల నిర్వహణ, వాన నీటి పారుదల, పట్టణ రవాణాతో పాటు పచ్చదనంతో నిండి ఉండే ప్రదేశాలను, పార్కులను అభివృద్ధిపరచడం… వంటివి భాగంగా ఉన్నాయి. ప్రణాళికరచన, అమలు.. ఈ రెండు ప్రక్రియల్లోనూ భౌతిక మౌలిక సదుపాయాల కల్పనలో స్మార్ట్ ఫీచర్లను సంధానించడానికి పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్‌బీస్) గత 10 సంవత్సరాల్లోనూ నిరంతరం కృషిచేస్తూ వచ్చాయి.

మిషన్‌లో వివిధ భాగాల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
నీటి సరఫరా
1. నీటి సరఫరా వ్యవస్థలు. వీటిలో.. ఇప్పుడున్న నీటి సరఫరా సదుపాయాలను పెంచడం, నీటి శుద్ధి ప్లాంటులతో పాటు అన్ని చోట్లా మీటర్ల వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం భాగంగా ఉంటాయి.
2. ప్రత్యేకించి తాగునీటి సరఫరాను, భూగర్భ జలాలను తిరిగి ఉత్తేజితం చేయడం కోసం అప్పటికే ఉన్న జలాశయాల సామర్థ్యాన్ని పునరుద్ధరించడం.
3. దుర్గమ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంత నగరాలతో పాటు నీటి నాణ్యత పరంగా సమస్యలు (ప్రాణాపాయకర విషతుల్య జలాలు, ఫ్లోరైడ్ పాళ్లు ఎక్కువగా ఉండే నీరు వంటివి) ఎదురవుతున్న నగరాలకు ప్రత్యేకంగా నీటి సరఫరా ఏర్పాట్లు చేపట్టడం.
మురుగు పారుదల
1. వికేంద్రీకరించిన, ఒక నెట్‌వర్క్‌తో కలిపిన భూగర్భ మురుగు పారుదల వ్యవస్థల (వీటిలో ప్రస్తుత సీవరేజి వ్యవస్థలు, సీవేజి శుద్ధి ప్లాంటుల సంఖ్యను పెంచడం కూడా కలిసి ఉంది.
2. పాత మురుగు పారుదల వ్యవస్థను, శుద్ధి ప్లాంటులను వేరే చోట్లకు మార్చడం.
3. ఒకసారి వాడిన నీటిని ఇతర ప్రయోజనాలకు మళ్లీ ఉపయోగించడం (రీసైక్లింగ్), వ్యర్థ జలాలను సైతం పునరుపయోగించడం.
వరద నీటి పారుదలకు ఉద్దేశించిన కాలువలు
1. వరదల వల్ల జలమయమైపోవడాన్ని తగ్గించేందుకు, క్రమంగా ఈ స్థితిని నిర్మూలించేందుకు కాలువలు, వాన నీటి పారుదల కోసం డ్రెయిన్ల నిర్మాణం తో పాటు ఇప్పటికే ఉన్న ఇలాంటి వాటిని మెరుగుపరచడం.
పట్టణ రవాణా
1. అంతర్దేశీయ జలమార్గాల కోసం (ఓడరేవు, బే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మినహా) నౌకలు, పెద్ద నౌకలతో పాటు బస్సులు
2. ఫుట్‌పాత్‌లు, నడకదారులు, పక్కన నిర్మించే బాటలు, ఫుట్ ఓవర్-బ్రిడ్జులతో పాటు మోటారుతో నడవని వాహనాలు కాకుండా ఇతర వాహనాల (ఉదాహరణకు సైకిళ్లు) వంటి వాటి కోసం అవసరమైన సౌకర్యాలు.
వాహనాలను నిలిపి ఉంచడానికి బహుళ అంచెల సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం.
బస్ ర్యాపిడ్ ట్రాన్జిట్ సిస్టమ్ (బీఆర్‌టీఎస్).
హరిత ప్రదేశాలు, పార్కులు
బాలబాలికలకు అనుకూలంగా ఉండే ప్రత్యేక ఏర్పాట్లతో పచ్చదనంతో కళకళలాడే ఆరుబయలు ప్రదేశాలు, పార్కులను అభివృద్ధి చేయడం.
సామర్థ్యాన్ని పెంచే కార్యక్రమాలు
1. దీనిలో రెండు భాగాలు ఉన్నాయి. అవి.. ఒకటోది వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచడం, రెండోది.. సంస్థాగత సామర్థ్యాన్ని పెంచడం.
2. సామర్థ్యాన్ని పెంచే కార్యక్రమాలను మిషన్ పరిధిలోని సిటీస్‌కు మాత్రమే పరిమితం చేయబోరు. ఈ కార్యక్రమాలను పట్టణ స్థానికి సంస్థల (యూఎల్‌బీస్)కు కూడా వర్తింపచేస్తారు.
3. నూతన మిషన్ల పునర్‌వ్యవస్థీకరణ అనంతరం కాంప్రిహెన్సివ్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం (సీసీబీపీ)ని కొనసాగిస్తారు.
‘అమృత్ 2.0’
‘అమృత్ 2.0’ను 2021 అక్టోబరు 1న మొదలుపెట్టారు. ఇది అన్ని పట్టణ స్థానిక సంస్థల (యూఎల్‌బీస్)ను కవర్ చేస్తుంది. నగరాలను నీటి విషయంలో కొరత ఎదురవకుండా, స్వయంసమృద్ధంగా నిలబెట్టడం ఈ కార్యక్రమం ఉద్దేశం. 500 అమృత్ నగరాల్లో సీవరేజీ, సెప్టేజీ నిర్వహణ సేవలను అన్ని ప్రాంతాలకూ అందేటట్టు చూడడం దీని ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ‘అమృత్ 2.0’కు మొత్తం రూ.2,99,000 కోట్లు ఖర్చు కావచ్చని భావిస్తున్నారు. దీనిలో అయిదు సంవత్సరాల కాలానికి గాను రూ.76,760 కోట్ల కేంద్ర వాటా కూడా కలిసి ఉంది.
గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ ‘అమృత్ 2.0’లో భాగంగా ‘‘జల్ హీ అమృత్’’ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. మురుగు పారుదలకు సంబంధించిన ప్లాంటులను సమర్థంగా నిర్వహించాల్సిందిగా రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ప్రోత్సహించే కార్యక్రమం ఇది. జల లభ్యతను మెరుగుపరచడానికి, జల సురక్షకు దన్నుగా నిలిచేందుకు నీటిని శుద్ధి చేయడంతో పాటు పునర్వినియోగించడం ఈ కార్యక్రమం ఉద్దేశాలు.
‘అమృత్ 2.0’లో భాగంగా సాధించిన విజయాలు
1. నీటి సరఫరా
• రూ.1,14,220.62 కోట్లు ఖర్చయ్యే 3,568 నీటి సరఫరా ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు.
• 181 లక్షల కొత్త నల్లా కనెక్షన్లకు ఆమోదముద్ర వేశారు.
• 10,647 ఎంఎల్‌డీ సామర్థ్యంతో నీటి శుద్ధి ప్లాంటు (డబ్ల్యూటీపీ)కి ఆమోదం తెలిపారు.
• సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ (ఎస్‌సీఏడీఏ) సాంకేతికతతో 1,487 నీటి సరఫరా ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
2. మురుగు నీరు, సెప్టిక్ ట్యాంకుల్లోని ఘన, ద్రవ రూప వ్యర్థాల నిర్వహణ
• రూ.67,607.67 ఖర్చయ్యే (ఓ అండ్ ఎం ఖర్చులు కూడా కలుపుకొని) 592 సీవరేజి, సెప్టేజి నిర్వహణ పథకాలకు ఆమోదం తెలిపారు.
• కొత్తగా 67.11 లక్షల మురుగు పారుదల సదుపాయాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారు.
• 6,739 ఎంఎల్‌డీ సామర్థ్యం కలిగి ఉండే మురుగు జలాల శుద్ధి ప్లాంటు (ఎస్‌టీపీ)లకు ఆమోదం తెలిపారు.
• ఎస్‌సీఏడీఏ సాంకేతికతతో 235 సీవరేజీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపారు.
అదనంగా నవకల్పన కాంపొనెంట్
• సాంకేతికత సబ్-మిషన్: ఇది అంకుర సంస్థ (స్టార్ట్-అప్)లకు సంబంధించిన ఆలోచనలను, ప్రయివేటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ‘అమృత్ 2.0’ లో మరో కాంపొనెంట్ ఇది.
• 120 అంకుర సంస్థలను తుది పరిశీలన కోసం ఎంపిక చేశారు.
• ప్రయోగాత్మక ప్రాజెక్టుల కోసం 82 అమృత్ నగరాలను మ్యాపింగ్ చేశారు.
‘అమృత్’, ‘అమృత్ 2.0’ లు సాధించిన సమగ్ర విజయాలు (గత పదేళ్ల కాలంలో)
వాస్తవిక ప్రగతి
• రూ.2,73,649 కోట్లు ఖర్చయ్యే 14,828 ప్రాజెక్టులను ‘అమృత్’తో పాటు ‘అమృత్ 2.0’లో భాగంగా మంజూరు చేశారు.
• మొత్తం కలిపి సుమారు రూ.1,12,368 కోట్లతో వివిధ పనులను పూర్తి చేశారు.
ఆర్థిక ప్రగతి
• మొత్తం వ్యయం రూ.3,77,000 కోట్లు
• ప్రాజెక్టుల కోసం రూ.1,02,786 కోట్ల కేంద్రీయ సహాయాన్ని (సీఏ) కేటాయించారు.
• కేంద్రం, రాష్ట్రాలు, పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్‌బీస్) ప్రాజెక్టులపై రూ.97,963 కోట్లను ఖర్చు చేశాయి.
• ప్రాజెక్టుల కోసం రూ. 47,625 కోట్ల సీఏ ను విడుదల చేశారు.
సాధించిన ప్రధాన ఫలితాలు (ప్రాజెక్టుల వారీగా)
• 2.03 కోట్ల నల్లా కనెక్షన్లతో పాటు 1.50 కోట్ల మురుగుకాలవ కనెక్షన్లను సమకూర్చారు.
• 9,511 ఎకరాల పరిధిలో 544 జలాశయాలను పునరుద్ధరించారు.
కార్యక్రమాలు
– ‘అమృత్ మిత్ర’ (‘AMRUT Mitra’) లో 10,000 మంది కన్నా ఎక్కువ మహిళా స్వయంసహాయ బృందాల (ఎస్‌హెచ్‌జీస్) సభ్యులు చేరారు. రూ.147 కోట్ల ఖర్చుతో 1,762 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు.
– డ్రింక్ ఫ్రం ట్యాప్’.. డీఎఫ్‌టీ (నల్లా నీటినే తాగండి)ని అమలు చేయడానికి రూ.23,490 కోట్లు ఖర్చు చేసి 381 ప్రాజెక్టులను చేపడుతున్నారు. వీటి వల్ల 8 లక్షల కుటుంబాలకు ప్రయోజనం అందే అవకాశం ఉంది. 3,630 మంది గుత్తేదారులకు, అధికారులకు శిక్షణనిచ్చారు.
– 1.09 లక్షల ఎకరాల పరిధిలో 3,032 జలాశయాల పునరుద్ధరణకు ఆమోదం తెలిపారు.
– గుత్తేదారులు, ప్లాంటు ఆపరేటర్లు, నల్లాలు, గొట్టాలు బాగు చేసే వారు, మహిళలు, యువతీయువకులు, అధికారులు సహా మొత్తం 90,000 కన్నా ఎక్కువ మందికి శిక్షణను ఇచ్చి, రాష్ట్రాల సామర్థ్యాలను పెంచారు.