పసుపు రైతు ఇంట్లో ”కనకధార”… చాలా ఏళ్ళకి ఇలా…

కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలతో పసుపు పంటకు ఈసారి ఆల్‌ టైమ్‌ రికార్డు ధర లభించింది. నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో క్వింటా 18,000 రూపాయలకు పైగానే ధర పలికింది. దీంతో పసుపు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ఇంత ధర ఎప్పుడూ లభించలేదు. మాములుగా చూసుకున్నట్లయితే పసుపు గిట్టుబాటు ధర 2011 లో క్వింటాలుకి 13,400 రూపాయలు పలికింది. ఆ తర్వాత 2015 లో 10 వేల ధర పలికింది.

 

ఇప్పుడు ఏకంగా 20వేల రూపాయలు పలుకుతోంది. సాధారణ సాగు విధానంలో రైతులు ఎకరాకి 20 క్వింటాళ్ల వరకు మాత్రమే పసుపు పంటను తీసేవారు. కానీ… బెడ్‌ విధానం వచ్చిన తర్వాత ఎకరాకి 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. దీంతో రైతులు తీవ్ర ఆనందంలో వున్నారు. ఈ యేడాది ప్రారంభం నుంచే పసుపు పంట క్వింటాల్‌ కి 8 వేల నుంచి మొదలైంది.దీంతో గరిష్టంగా 20 వేల రూపాయలు పలుకుతుంది. పసుపు ధర బాగా రావడంతో పసుపు కొమ్ములకు కూడా మంచి ధర వచ్చినట్లు అయ్యింది. నిజామాబాదు జిల్లా పసుపు పంటకి బాగా పేరు తెచ్చిపెట్టింది. ఇక్కడి రైతులు ఈ పంటలో నాణ్యతను పాటిస్తరు. గత 10 యేళ్లుగా ఇబ్బందులు వున్నా.,.. ఈ యేడాది పంట మాత్రం బాగానే పండింది.

 

కాగా, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ నిర్ణయం మూలంగానే పసుపు పంటకి గిరాకీ వచ్చింది.పసుపు పంట దిగుమతులను నియంత్రించడంతో క్రమంగా డిమాండ్‌ పెరుగుతూ వచ్చింది. ఈ యేడాది దాని ఫలితాలు కనిపించాయి. 15 వేల ధర వుంటే గిట్టుబాటు అవుతుందని రైతులు చెప్పారు. గతంలో ఏటా 6 వేలు, 7 వేల మధ్యనే ధరలు పలికేవి. ఎండలు అంతగా లేకపోవడంతో తేమ శాతం అధికంగా వున్న పంట మార్కెట్‌ కి వచ్చినట్లు సంబంధిత వర్గాలు అంటున్నాయి. కొందరు తేమతోనే పంటను తెచ్చినా, చాలా మంది ఉడికించి, ఆరబెట్టి, పాలిష తెచ్చిన పంటకు మంచి ధర వచ్చిందని అంటున్నారు. మెట్‌పల్లి మార్కెట్‌ లో కూడా అత్యధిక ధర పలికిందని రైతులు ఆనందంగా వున్నారు. ఈ యేడాది వరకు కూడా ధరలు ఇలాగే వుండాలని రైతులు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *