జమ్మూ కశ్మీర్ లో ఎన్ కౌంటర్… ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదుల హతం
జమ్మూ కశ్మీర్ లో మంగళవారం ఇస్లామిక్ ఉగ్రవాదులకు, భారత జవాన్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. షోఫియాన్ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదులు హతమయ్యారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం మొదట కుల్గాం ప్రాంతంలో ఈ ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. తర్వాత అవి షోఫియాన్ కి విస్తరించాయి. గంటకు పైగా ఈ ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో హతమైన ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదులూ లష్కరే తోయ్యబాకి చెందినవారేనని తెలుస్తోంది.
చనిపోయిన ఉగ్రవాదుల్లో స్థానిక వ్యక్తి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అతడి పేరు షాహిద్‌గా తెలుస్తోంది.భద్రతా దళాల కాల్పుల్లో మొదట ఓ ఉగ్రవాది చనిపోయాడు. మిగిలిన ఇద్దర్నీ చుట్టు ముట్టిన బలగాలు అరగంట వ్యవధిలోనే కాల్చి చంపేశాయి. హతుల్లో ఇద్దర్ని భద్రతా బలగాలు గుర్తించాయి. ఒకడు షాహిద్ కుట్టాయ్. 2023 లో లష్కరే తోయబాలో చేరాడు. హీరాపుర ప్రాంతంలో స్థానిక బీజేపీ నేత హత్యలో ప్రమేయం వుంది. మరో ఉగ్రవాది అద్నాన్ షఫీదార్. 2024 లో లష్కరే తోయబాలో చేరాడు.