దేశమే నాది
నిరంకుశ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు స్వాతంత్య్రవీర సావర్కర్. అండమాన్ జైలులో కఠినశిక్ష కూడా అనుభవించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు చెందిన నాలుగు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత అలా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూముల్ని ఎవరివి వారికి ఇచ్చేశారు. కానీ నెహ్రూ ప్రభుత్వం మాత్రం సావర్కర్‌కు చెందిన నాలుగెకరాల భూమిని తిరిగి ఇవ్వడానికి నిరాకరించింది.
ఈ విషయం తెలుసుకున్న సావర్కర్ ‘భారతదేశమే నాదైనప్పుడు అందులో నాలుగెకరాలు నావికాకపోయినా ఫరవాలేదు’ అని అన్నారు.