కుటుంబం ఒక శిక్షణాలయం

–  డా. మోహన్‌ భాగవత్‌

కుటుంబం విషయం తీసుకుని సంఘ శతాబ్ధి ఉత్సవాల (2025)లో సమాజంలోకి వెళ్ళాలని నిశ్చయించాం. గతసారి లోకమంథన్‌ సమావేశాల్లో అర్థనీతి గురించి చర్చజరిగింది. అందులోని విషయాలపై ఆధారపడి అర్థవ్యవస్థ ఉంటుందని అనుకున్నాం. 1. మందిరం, 2. వ్యవసాయం, 3. కటుంబం. కుటుంబంలో సంబంధ బాంధ్యవాలు ఉంటాయి. అది రక్త సంబంధమైనా, భావనా సంబంధం అయినా, ‘వీళ్ళు మనవాళ్ళ’ అనే భావంతో కుటుంబం ఏర్పడుతుంది. ఇది చాలా ముఖ్యం. బయటి దేశాలవాళ్ళు కుటుంబం భద్రత కోసం ఉంటారు. కాని మనిషి వొంటరిగా ఉండ లేదు. ఒంటరిగా ఉంటే  పిచ్చివాడయి పోతాడు.

స్వతంత్ర సమరంలో ఉరి కంబాలనెక్కిన అనేక మంది సంతోషంగా మరణం ఆహ్వానించారు. రామ్‌ప్రసాద్‌ బిస్మిల్‌ సాయంత్రం ఉరివేస్తారనగా ఉదయం బస్కీలు తీస్తుంటే అక్కడి అధికారి ‘ఎందుకు చేస్తున్నావిదంతా, సాయంత్రం నిన్ను ఉరితీస్తారు అంటే.. బస్కీల వల్ల ఉరి వేసినా భయం లేని ధైర్యం మాకు అబ్బింది’ అన్నాడు.

పిల్లలు అల్లరి చేస్తారు. వాళ్లకు తెలీదు. వాళ్లు క్రమంగా నేర్చుకుంటారు. నేర్చుకునే వ్యవస్థ కుటుంబం. సమాజంలో ఒక యూనిట్‌ కుటుంబం. పశుపక్ష్యాదుల్లో కుటుంబం లేదు. ముందు ఉన్నా తరువాత ఎవరికివారే. మనలో అలాకాదు, కాని విడివిడిగా ఉండాల్సి పరిస్థితులు వస్తున్నాయి. బీహారులో ఛట్‌ పండుగనాడు కుటుంబంలో ఎవరు ఎక్కడున్నా అంతా ఒక్కచోట కలుస్తారు. చిన్న పిల్ల వాడు క్రమంగా కుటుంబ బంధాలన్నీ తెలుసు కుంటాడు. కుటుంబం ఒక శిక్షణాలయం. క్రమంగా ఇంట్లో పనివాళ్ల గురించి తెలుస్తుంది. వాళ్ళను కూడా పిన్నీ, బాబాయి అంటాం. ఇంట్లో కుక్క, గోవు ఉంటే వాటిని కూడా ఆదరించాలని తెలుస్తుంది. ఇంట్లో వేపచెట్టు, తులసిచెట్టు ఉన్నాయి. ఇవి కూడా నావే. కుటుంబం తరువాత వన్నీ ‘పరివార్‌’ అయిపోయితాయి. బిచ్చగాడువస్తే ఒక పిడికెడు బియ్యం వేసి రమ్మని పిల్లవాడ్డిని పంపిస్తే అతడు మనకుటుంబంలోని వాడుకాదు, కాని అడుగుతున్నాడు కాబట్టి ఇవ్వాలి అని తెలుస్తుంది. అలా సమాజం నడుస్తుంది.

ఇంట్లో తండ్రి సంపాదిస్తాడు. అందరూ భోజనం చేస్తారు. కాని తండ్రి ఇంటికి రాగానే సేవలు చేస్తారు. పిల్లలు సంపాదించడం లేదు. కాని వారిని చక్కగా పెంచి పోషిస్తారు, పెద్ద చేస్తారు తల్లిదండ్రులు. తరువాత వాళ్ళు చూస్తారా లేదా అని కాదు, పిల్లలు మంచి వ్యక్తులుగా తయారు కావాలి అనేది వారి ఉద్దేశ్యం. కుటుంబంలో చేసే విషయాలే సమాజంలో ప్రతిబిబిస్తాయి. కుటుం బంలో ఇచ్చిన సంస్కారమే పెద్దయిన తరువాత పిల్లల్లో వెల్లివిరిసే విషయమవుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా కుటుంబం ఒక ఆర్థిక ఆలంబన అవుతుంది.

ఇంట్లో మా అమ్మ డబ్బు దాచిపెడ్తుంది. పిల్లల పెళ్ళిళ్ళయితే కొత్త బట్టలకుంటాయని ఆమె అలా చేస్తుంది. ఎవరు చెప్పారు. ఎవరూ చెప్పలేదు. కాని ఆమె అలా పొదుపు చేస్తుంది. మనకు ఇళ్లల్లో బంగారం ఉంటుంది, విదేశాల్లో ప్రభుత్వల వద్ద ఉంటుంది. విది మనకు అవసరానికి ఆదుకుం టుంది. కాబట్టి ప్రపంచంలో ఏదైనా సంభవించినా మన దేశంలో మన కుటుంబాల్లో ప్రమాదం అవదు, ఏదో కొంచెం యిబ్బంది రావచ్చు. కారణం మన సంపద ప్రభుత్వం వద్ద ఉండదు. సమాజంలో అక్కడక్కడా వికేంద్రీకరించబడి ఉంటుంది. ఎంతకావాలో అంత వాడుకుంటారు. కాని దేశం కోసం అవసరమైతే ఇచ్చేస్తారు. రామమందిరం విషయంలో హృదయ పూర్వకంగా ప్రజలు విరాళాలందించారు. పాకిస్తాన్‌లో యుద్ధం వస్తే బంగారం అందించారు. సంస్కృతి కూడా మనకు కుటుంబం ద్వారా సంక్రమించింది. సంస్కృతి బాహ్యంగా కనపడేది కాది. అది మనః ప్రవృత్తి ఒక ప్యాపారి దగ్గర తూకం ప్రకారం కొన్ని డబ్బులు చెల్లించినా అతను కొంత కొసరుసరుకు వేస్తాడు. నడుస్తుంటే ఎవరి పాదానికయినా పుస్తకం తగిలితే వెంటనే నమస్కరిస్తారు. పుస్తకం సరస్వతి కనుక. ఇవన్నీ ఏ గ్రంథంలోనూ రాయలేదు. ఇది ప్రవృత్తి, ఇది కుటుంబం నుంచి వచ్చిన సంస్కారం. పరస్త్రీ తల్లి అనేది మన భావన. ఇది ఇంట్లో చిన్నప్పటి నుంచి ఇచ్చే సంస్కారం. పరద్రవ్యం మట్టి అనే విషయం కుటుంబంలో అనుభవమవుతుంది. విదేశాల్లో వివాహం ఒక కాంట్రాక్ట్‌ వంటిది. మనకు వివాహం బంధం వంటిది. ఏడు జన్మల సంబంధం. నలదమయంతుల దాంపత్యం ఆదర్శవంతమైనది.

వ్యక్తి `వ్యక్తి నుంచి కుటుంబం, కుంటుంబం నుంచి పరివారం, పరివారం నుంచి గ్రామం, గ్రామం నుంచి సమాజం, సమాజం నుంచి మానవత, మానవత నుంచి విశ్వ సృష్టి వరకు మన పిల్లలు ఆలోచించే సంస్కారం మనం ఇవ్వగల్గుతున్నామా? అని ఆలోచించాలి. కొత్త తరానికి ఈ సందేశం వెళ్తున్నదా? వారంలో ఒకసారి ఈ సంవాదం జరగాలి. సమాజం, దేశం ముందు అన్న విషయం కటుంబ జీవనంలో మనం గ్రహించాలి. బకాసురుడ్ని చంపడానికి కుంతి భీముడ్ని పంపంది. కొడుకు పెళ్ళి ఉన్నా సింహ గఢ్‌ను జయించడానికి ముందు దేశం ముఖ్యమని తానాజీ భావించాడు. యుద్ధంలో వీరమరణం పొందాడు. తానాజీతో పాటు గ్రామలో 300 కుటుంబాలు యుద్ధభూమికి వెళాయి. మంచి సమాజం కోసం మంచి కటుంబం కావాలి. ఇవాళ ప్రపంచానికి మన కుటుంబ వ్యవస్థ ఆదర్శం కావాలి. ప్రపంచం మన వైపు చూస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *