కేరళ: ఐదేళ్లలో 5338 మంది బాలికలు మిస్సింగ్‌

కేరళ రాష్ట్రంలో అనేక మంది బాలికలు, మహిళలు ఆచూకీ లేకుండా పోతున్నారు. 2019 జనవరి నుండి 2023 డిసెంబర్‌ 31 వరకు 5 సంవత్సరాల వ్యవధిలో కేరళ రాష్ట్రంలో 5338 బాలికల మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడయింది. 2024

ఏప్రిల్‌ 12న తిరువనంతపురంలో స్టేట్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో, ప్రజా సమాచార అధికారి వివరాలను వెల్లడిరచారు.
ఇది గిరీష్‌ భరద్వాజ్‌, 11-అస్థిత్వ, రైల్వే సమాంతర రహదారి, శేషాద్రిపుర, బెంగళూరు నుండి విచారణకు సంబంధించి జరిగింది.
5338 మంది కనిపించకపోవడం అనేది దిగ్భ్రాంతికరమైన, కలవరపెట్టే విషయం. ఇలాంటి సంఘటనలపై చర్చించడానికి బిజెపియేతర రాజకీయ నాయకులు గానీ వారి పార్టీలు గానీ ఇష్టపడరు. పైగా ఆ విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి సంఘటనల గురించి ఎక్కువగా చర్చిస్తే అది చివరికి లవ్‌ జిహాద్‌ అనే విషయంతో ముగుస్తుందని వారు భయపడుతారు. లవ్‌ జిహాద్‌లో చిక్కుకుని, ISIS రిక్రూట్‌మెంట్‌ కోసం ఆఫ్ఘనిస్తాన్‌ సిరియాలకు తీసుకెళ్లిన అనేక మంది అమ్మాయిల సమస్యపై ప్రజల దృష్టిని ఆకర్షిస్తుందని వారు భయపడుతున్నారు. ఇది RSS, BJP ఇతర హిందూ జాతీయవాద శక్తులు గత కొన్నేళ్లుగా చేస్తున్న ఆందోళనలను నిరూపితమవు తాయని వారు భయపడుతున్నారు.

కేరళలోని ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (UDF), అధికార సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (LDF) రెండూ మైనారిటీ ఓటు బ్యాంకు కోసం ఎల్లప్పుడూ గట్టి పోటీనిస్తాయి. కాబట్టి, వారు ఎప్పుడూ ఇలాంటి చర్చల నుండి తప్పించు కుంటారు. ఉచ్చులో చిక్కుకుని ఆఫ్ఘనిస్తాన్‌, సిరియాలకు తీసుకెళ్లిన అమ్మాయిలు లవ్‌ జిహాద్‌ బాధితులని వారు ఇప్పటికీ అంగీకరించడానికి సిద్ధంగా లేరు.

ఇటీవల కర్నాటకలోని కాంగ్రెస్‌ నాయకుడి కుమార్తె తన క్లాస్‌మేట్‌ ఫయాజ్‌ చేతిలో హత్యకు గురైంది. లవ్‌ జిహాద్‌ కారణంగానే తన కూతురు నేహా హిరేమెత్‌ హత్యకు గురైందని కాంగ్రెస్‌ నేత నిరంజన్‌ హిరేమత్‌ ఆరోపించారు. ఈ ఘటనకు లవ్‌ జిహాద్‌తో సంబంధం లేదని కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం వాదిస్తున్నప్పటికీ ఆయన ఈ ఆరోపణను గట్టిగా నిలబడ్డారు. ఈ హత్యకు కారణం లవ్‌ జిహాద్‌ అంటూ ఏబీవీపీ ఆందోళనకు దిగింది. నేరస్థుడిని అత్యంత కఠినంగా శిక్షించాలని ABVP డిమాండ్‌ చేసిన సంఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

మిస్సింగ్‌ కేసులను సక్రమంగా విచారించడం లేదని ప్రజలకు అర్థమయినప్పుడు విషయం తీవ్రమవుతుంది. విచారణ సరిగ్గా జరగకపోతే, తప్పిపోయిన వారిని తిరిగి కనుక్కొలేని పరిస్థితి ఏర్పడుతుంది.

తప్పిపోయిన మొత్తం 5338 మంది అమ్మాయిలు లవ్‌ జిహాద్‌లో చిక్కుకున్నారనే ఆరోపణతో ఇప్పటి వరకు ఏ హిందూ సంస్థ ముందుకు రాలేదనడంలో సందేహం లేదు. కానీ, ఇప్పటికీ, ప్రశ్న మిగిలి ఉంది. వారికి ఏమైంది? ఈ విషయంపై వేగవంతమైన, సరైన, నిష్పాక్షికమైన, అత్యంత సమర్థవంతమైన దర్యాప్తు బాధ్యత నుండి ప్రభుత్వం తప్పించుకోదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *