పర్యావరణ పరిరక్షణే లక్ష్యం… సంప్రాదాయ సేద్యం దిశగా సంతాలీలు

పశ్చిమ బెంగాల్‌లో సంతాలీ తెగవారు ఒక ప్రత్యేక సంస్కృతి సంప్రదాయాలు కలిగిన వారు. విశ్వకవి రవీంద్రనాథ్‌ ‌ఠాగూర్‌ ‌సంతాల్‌ ‌తెగల వారి ప్రత్యేకమైన జీవన విధానానికి వారి రచనల ద్వారా ప్రత్యేక గౌరవం ఇచ్చారు. సంతాలీలు కవిత్వం, సంగీతం, నృత్యాలను జోడించి వ్యవ సాయాన్ని ఆహ్లాదకరంగా చేసుకునేవారు. పశ్చిమ బెంగాల్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో అంతటా విస్తరించి ఉన్న సంతాలీలు తమకున్న కొద్దిపాటి వ్యవసాయ క్షేత్రంలో నిరంతర కృషి చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.

వరి పంట పండిచడంలో ఆధునిక పద్ధతులు అవలంభించడం వల్ల భూగర్భజలాలు తగ్గిపోవడం, రసాయన ఎరువుల వాడిన పంటలు ఆహారంగా తీసుకోవడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురికావడం వంటి సమస్యలను అధిగమించడానికి పశ్చిమ బెంగాల్‌లోని సంతాలి తెగ వారు వ్యవసాయంలో ప్రాచీన సంప్రాదాయ పద్ధతులను మళ్లీ కొనసాగించడానికి తమ మూలాలను వెళికి తీసే ప్రయత్నం చేస్తున్నారు.

వ్యవసాయాన్ని వారు ఎంతో ఆరాధిస్తారు. వారి సాంప్రదాయ పాటలైన, ‘హర్‌ ‌హర్‌ ‌ధర్తి రిమా బహా బాగన్‌బీ బహా బాగన్‌ ‌రిమా హునార్‌ ‌బహా’ పాటలతో వారు వ్యసాయాన్ని, భూమిని, ప్రకృతిని దైవంతో కొలుస్తారు. సంతాలిలు సేద్యాన్ని ఎంతో నమ్మకంతో, వైవిధ్యంగా చేస్తారు. కానీ ఆధునిక వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అవలంబిం చడంతో ఈ జీవవైవిధ్యం చాలావరకు దెబ్బతిందని వారు గ్రహించారు.

బీర్‌ ‌భూమ్‌ ‌జిల్లాలో చాలా మంది సంతాతీలు తమ ఆహారాన్ని పశుగ్రాసంగా వేసినప్పుడు పశువులు అనారోగ్యానికి గురవడం, వరి క్షేత్ర పర్యావరణ వ్యవస్థలలో చుట్టుపక్కల ఉన్న గుల్మకాండ మొక్కల అదృశ్యమవడాన్ని వారు గమనించారు. ఈ సమస్యలను అదిగమించి పర్యవరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో బోల్పూర్‌ ‌లోని సంతాలీలు తమ పురాతన పద్దతులను తిరిగి తీసుకురావాడానికి ప్రయత్నిస్తున్నారు. ఆధునిక శాస్త్రీయ పద్దతుల వల్ల కోల్పోయిన వాటిని సాంప్రదాయ జ్ఞానం మీద ఆధారపడి ఉన్న పద్దతుల ద్వారా సరైన పద్దతిలో వ్యవసాయం చేస్తూ, భూమిని, పర్యావరణాన్ని కాపాడటానికి సిద్ధపడ్డారు.

హరిత విప్లవంతో వరిసాగులో ప్రారంభమైన వివిధ రకాల ఆధునిక పద్దతులతో వ్యవసాయ రంగం ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఇది భూగర్భజలాలు, రసాయన ఎరువులు, పురుగు మందుల అధిక వినియోగానికి ప్రాధాన్యత నిచ్చింది. దీంతో సంవత్సరాలుగా నేల జీవవైవిధ్యం క్షీణతకు దారితీసింది. కొత్త రకం బియ్యం, దాని పొట్టిగా, బలహీనమైన కాండాలతో, పశువుల పశుగ్రాసంగా కూడా ఉపయోగపడని స్థితికి దారి తీసింది.

రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం రైతుల ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేసింది. కొంతమంది సంతాలీల పశువులు గడ్డిని తిన్న తర్వాత లేదా స్థానిక వరి పొలాల్లోని నీరు త్రాగిన తర్వాత అనారోగ్యం పాలై మృత్యువాత పడటాన్ని వారు గ్రహించారు. ఇక ఆధునిక పద్దతులతో సేద్యం చేయడం మనుషులకు, జంతువులకు, ప్రకృతికి హానికరమని గుర్తించి సహజసిద్ధమైన సాంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని నిర్ణయించు కున్నారు.

ఆధునిక పద్ధతుల ద్వారా వరి పంట ప్రమాదాలను గుర్తించిన మహిళల నేతృత్వంలోని బృందం వ్యవసాయం అటవీప్రాంతాన్ని అభ్యసిస్తున్న విధానానికి స్థిరమైన ఆర్థిక ప్రత్యామ్నాయం కోసం పెర్మాకల్చర్‌తో స్థానిక జ్ఞానాన్ని సమగ్రపరిచింది. పెర్మాకల్చర్‌ అనే వ్యవసాయ విధానం శాశ్వత, స్వయం సమృద్ధిగా ఉండటానికి ఉద్దేశించిన వ్యవసాయ పర్యావరణ వ్యవస్థ.  బోల్పూర్‌లోని ఖంజన్పూర్‌ ‌గ్రామానికి చెందిన ఈ బృందం ఎకరానికి కొంచెం తక్కువ భూమిని చదునుచేసి, పచ్చని పర్యావరణ వ్యవస్థగా మార్చింది.

వారి విజయం చుట్టు పక్కల గ్రామాల వారికి సహజ వ్యవసాయం చేసే దిశగా స్ఫూర్తినిచ్చింది. సాంప్రదాయ వ్యవసాయ పద్దతులను పాటించేలా వారిని ప్రేరేపించింది. ఇది భూగర్భ జలాలను సంరక్షించడమే కాక, భవిష్యత్‌ ‌తరాలను రసాయనాలు లేని నీటిని, ఆహారాన్ని అందివ్వడమే కాక అధిక దిగుబడిని పొందేలా ఉపయోగ పడుతుందని నిరూపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *