రాజస్థాన్‌లో 300 సంవత్సరాల గుడి, హిందువుల ఇండ్లు నేలమట్టం

రాజస్థాన్‌లోని ఆల్వార్‌ జిల్లా, రాజ్‌గఢ్‌లో 300 సంవత్సరాలనాటి అత్యంత పురాతనమైన హిందు వుల దేవస్థానాన్ని అధికారులు నేలమట్టం చేశారు. స్థానిక పత్రికల ప్రకారం దేవస్థానాన్ని నేల మట్టం చేయడంలో ఒక జేసీబీని వినియోగించారు. విగ్రహాలను సైతం ధ్వంసం చేశారు. ఇండియా టీవీ ప్రకారం దేవస్థానంలో శివలింగాన్ని సైతం డ్రిల్స్‌తో పెకలించివేశారు.

సిటీ మాస్టర్‌ ప్లాన్‌ను సాకుగా చూపి రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా 85కుపైగా హిందూ కుటుంబాలకు చెందిన ఇండ్లను సైతం రాజ్‌గఢ్‌ అధికారులు కూల్చివేశారు. దైనిక్‌ భాస్కర్‌లో వచ్చిన ఒక వార్తా కథనం ప్రకారం రాజగఢ్‌లోని స్టేషన్‌ రోడ్డును 120 మీటర్ల దూరానికి 60 అడుగుల మేర వెడల్పునకు విస్తరించాలని ఆమోదించిన మాస్టర్‌ ప్లాన్‌లో ఉంది. ఆ ప్రకారం నంద్‌లాల్‌ షా గార్డెన్‌ నుంచి శైని ధర్మశాల వరకు రోడ్డును వెడల్పు చేయాలి. ఆ తర్వాత మిగిలిన 50 అడుగుల వెడల్పుతో ఇరుకిరుకు రోడ్డు మాస్టర్‌ ప్లాన్‌లో లేదు.

ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే,  తమ దగ్గర అధికారిక డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ తమ ఇండ్లను, దుకాణాలను అధికారులు కూల్చివేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి మొదలుపెట్టిన ఈ డ్రైవ్‌లో పురాతన దేవస్థానాలతో పాటుగా 150కి పైగా ఇండ్లు, దుకాణాలు నేలమట్టమైపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *