భారత వాయుసేన సరికొత్త రికార్డ్.. నైట్‌ విజన్‌ గాగుల్స్‌ సాయంతో సక్సెస్‌పుల్‌ ల్యాండ్

మన భారత వాయు సేన మరో అరుదైన ఘనత సాధించింది. తొలిసారి నైట్‌ విజన్‌ గాగుల్స్‌ సాయంతో విమానాన్ని సక్సెస్‌పుల్‌గా ల్యాండ్‌ చేసింది. ఈస్టర్న్‌ సెక్టార్‌లోని అడ్వాన్స్డ్‌ ల్యాండిరగ్‌ గ్రౌండ్‌లో నైట్‌ విజన్‌లో ఐఏఎఫ్‌సీ 130జే విమానాన్ని విజయవంతంగా ల్యాండ్‌ చేసినట్లు వాయుసేన ట్విట్టర్‌ వేదికగా వెల్లడిరచింది. ఒక వీడియోలో ఎన్‌వీజీ టెక్నాలజీతో విమానం సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ అయిన దృశ్యాలు, మరో వీడియోలో విమానం లపలి నుంచి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఎన్‌వీజీ విజువల్స్‌ కావడంతో ఈ దృశ్యాలు ఆకుపచ్చ రంగులో కాస్త భిన్నంగా వుంటాయి. ఈ ఎన్‌వీజీ సాంకేతికతను ఉపయోగించి, ఐఏఎఫ్‌ తక్కువ కాంతి పరిస్థితుల్లో సురక్షితమైన, మరింత ప్రభావవంతమైన కార్యకలాపాలను కూడా నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు.

 

రాత్రిపూట మిషన్లను అత్యంత సమర్థవంతంగా నిర్వహించడమే దీని లక్షణమని అధికారులు తెలిపారు. వెలుతురు తక్కువగా వున్న సమయాల్లో రాత్రిపూట సమయాల్లో విమానాలను అత్యంత సురక్షితంగా ల్యాండ్‌ చేయడానికి ఈ సాంకేతికత దోహదపడుతుంది. దేశ సవర్వ భౌమత్వ పరిరక్షణకు ఎప్పుడూ ససద్ధంగా వుంఆమని, తమ సవమర్థ్యాలను పెంపొందించేందుకు కట్టుబడే వున్నామని వాయుసశీన తెలిపింది. వాయుసశీన కొన్ని సంవత్సరాల కిందట నియంత్రణ రేఖ వద్ద కార్గిల్‌ ఎయిర్‌ స్రస్టప్‌ మీద ఇదే విమానాన్ని రాత్రివేళ విజయవంతంగా దింపింది. తక్కువ ససథలంలోనే ల్యాండిరగ్‌, టేకాఫ్‌ కావడం దీని ప్రత్యేకత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *