బ్లీడిరగ్‌ ఇండియా, రక్తసిక్త భారతం  పుస్తకాల ఆవిష్కరణ

భాగ్యనగరంలో సెప్టెంబర్‌ 28న శ్రీ బినయ్‌ కుమార్‌ వ్రాసిన బ్లీడిరగ్‌ ఇండియా, ఆ పుస్తకపు తెలుగు అనువాదం  రక్త సిక్త భారతం  పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు, భారతీయ మజ్దూర్‌ అఖిల భారత ఆర్గనైజింగ్‌ సెక్రటరీ శ్రీ బి.సురేందరన్‌, అఖిల భారత సహప్రచార ప్రముఖ్‌ శ్రీ నరేంద్ర ఠాకూర్‌, పుస్తక రచయిత శ్రీ బినయ్‌ కుమార్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పుస్తక రచయిత శ్రీ బినయ్‌ కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘‘రaార్ఖండ్‌లో ఒక ముస్లిం యువకుడు హిందూ గిరిజన మహిళను వివాహమాడిన తరువాత కూడా మతం మార్చ లేదు’’ అన్న వార్త ఆశ్చర్యం కలిగించిందనీ, ఆ విషయం పై పరిశోధన చేయగా బంగ్లాదేశ్‌ చోరబాటు దారులు దాదాపు పదివేల మంది ఇలా హిందూ గిరిజన స్త్రీలను వివాహం పేరున లోబరుచుకొని పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరిపారని ఈ పన్నాగం వెనుక ూఖీI హస్తం ఉందనీ అర్ధం అయ్యిందని చెప్పారు. ఈ విషయం సామాన్యులకు అర్ధం కావలిసిన అవసరం గమనించి ఈ పుస్తకాన్ని రచించాననీ తెలిపారు. సురేంద్రన్‌ గారు మాట్లాడుతూ ’’ దళిత అనే పదాన్ని దళిత ఙశీఱషవ  అనే పేరు గల సంస్థ వ్యవస్థాపకుడు పు రాజశేఖర్‌ అనే వ్యక్తి ప్రాచుర్యం లోకి తెచ్చారనీ, 1980లలో షెడ్యూలు కులాలు అని కాకుండా దళిత అనే పదం తో దేశ విచ్చిన్నకర ఆలోచనలతో ఎలా హిందూ సమాజం లో అనైక్యత పెంచే ప్రయత్నం జరిగిందీ ఇప్పుడు ఈ అనైక్యత వల్ల జరుగుతున్న అనర్ధాలను ప్రస్థావించారు.

అఖిల భారత సహ ప్రచారప్రముఖ్‌ శ్రీ నరేంద్ర ఠాకూర్‌ మాట్లాడుతూ ప్రపంచంలో ఇస్లామిక్‌ తీవ్రవాదానికి నిధులు అందుతున్న ప్రధాన మార్గాల్లో హలాల్‌ సర్టిఫికేషన్‌ ఒకటని అన్నారు. ఈ హలాల్‌ మాఫియా చాలా పెద్దదని, ఒక వస్తువుకు హలాల్‌ సర్టిఫికేట్‌ పొందాలంటే 20వేల రూపాయాల రుసుము చెల్లించవలసి ఉంటుందని, ఆ సర్టిఫికేట్‌ రెన్యు చేసుకునేందుకు ప్రతి సంవత్సరం అదనంగా మరో 10వేల రూపాయలు చెల్లించవలసి ఉంటుం దని ఆయన అన్నారు. ఎలాంటి ప్రభుత్వ గుర్తింపు లేని ఈ హలాల్‌ సర్టిఫికేషన్‌ వ్యవహారాన్ని 29 సంస్థలు నిర్వహిస్తున్నాయని ఆయన వివరించారు. ఈ సంస్థల్లో ముఖ్యమైన జమైత్‌-ఉలేమా-ఇ-హింద్‌ అనే సంస్థ సాగించే వివాదాస్పద కార్యకలాపాల గుట్టు ఇటీవలే రట్టయిందని ఆయన వెల్లడిరచారు. 1971, 1991 మధ్య కాలంలో అస్సామ్‌లో ముస్లిం జనాభా రెట్టింపు అయ్యిందని, ప్రస్తుతం మన దేశంలో 2.5 కోట్ల చొరబాటుదారులు తిష్టవేసుకుని ఉన్నారని అన్నారు. ప్రణాళికబద్ధంగా జరుగుతున్న ఈ చొరబాట్లను వివరించడానికి రచయిత రోహిం గ్యాల ఉదాహరణ తీసుకున్నారని శ్రీ నరేంద్ర అన్నారు.

బర్కత్‌పురాలోని కేశవ నిలయంలో ఈ పుస్తకాన్ని పొందవచ్చు. ఆన్‌లైన్‌లో  కింది లింక్‌ ద్వారా పుస్తకాన్ని కొనుగోలు చేయవచ్చు.

రక్తసిక్త భారతం: https://www. hindueshop.com/product/rakta-sikta-bhaaratam/
BLEEDING INDIA : https://www. hindueshop.com/product/bleeding-india/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *