సత్యం ఎప్పుడూ గెలుస్తుంది.. మన దేశ ధర్మమే సత్యం : డా. మోహన్‌ ‌జీ భగవత్‌

‘‘‌సత్యం ఎప్పుడూ గెలుస్తుంది.. మన దేశ ధర్మమే సత్యం.. ప్రపంచం మొత్తానికి ఇలాంటి పాఠం చెప్పడానికే మనం భారత్‌లో పుట్టాం. సంఘం ఎవరి ఆరాధనా విధానాన్ని, ప్రాంతాన్ని, భాషను మార్చకుండా మంచి మనుషులను తయారు చేస్తుంది’’ అని రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌.ఎస్‌.ఎస్‌) ‌సర్‌ ‌సంఘ్‌చాలక్‌ ‌డాక్టర్‌ ‌మోహన్‌ ‌భగవత్‌ అన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లోని ముంగేలి జిల్లా మద్కుద్వీప్‌లో జరిగిన ఘోష్‌ ‌శిబిర ముగింపు కార్యక్రమంలో భగవత్‌ ‌మాట్లాడారు.

ఈ సందర్భంగా మోహన్‌ ‌జీ మాట్లాడుతూ ‘సత్యం ఎప్పుడూ గెలుస్తుంది. అబద్ధాలు ఎన్నటికీ గెలవవు. మన దేశ ధర్మం సత్యం, సత్యం ధర్మం.. ప్రాచీన కాలంలో మన సాధువులు సత్యాన్ని పొందారు కాబట్టి భారతదేశ ప్రజలు ప్రపంచంలోనే ప్రత్యేకంగా పరిగణించబడ్డారు అని అన్నారు. మనం చరిత్రను పరిశీలిస్తే, ఎవరైనా (దేశం) తడబడి, గందరగోళానికి గురైనప్పుడు అది ఒక మార్గం వెతకడానికి భారతదేశానికి వచ్చినట్టు కనిపిస్తుంది అని భగవత్‌ ‌పేర్కొన్నారు. మన పూర్వీకులు ప్రపంచమంతటా పర్యటించారని, ఎవరి గుర్తింపును మార్చడానికి ప్రయత్నించకుండా గణితం, ఆయుర్వేదం వంటి జ్ఞానాన్ని, భావనలను వ్యాప్తి చేశారని, అదే సమయంలో మొత్తం ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా పరిగణించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

‘మనందరిలో మానసిక ఐక్యత ఉండాలి. రూపాలు భిన్నంగా ఉండవచ్చు, కానీ స్వరం ఒకేలా ఉండాలన్నారు. మత గ్రంథాలలో పేర్కొన్న విషయాలను ప్రస్తావిస్తూ.. పరాయి స్త్రీని తల్లిగా భావించడం, ఇతరుల సంపద.. వృథా లాంటిదని శతాబ్దాలుగా కొనసాగుతోందని’ అని మోహన్‌ ‌భగవత్‌ అన్నారు. ‘మనకు ఏది చెడుగా అనిపి స్తుందో, మనం ఇతరులతో ఆ విధంగా ప్రవర్తిం చము.. పౌర హక్కులు ఉన్నాయి. రాజ్యాంగ ప్రవేశిక, పౌర విధులు కూడా ఉన్నాయి. వీటన్నిం టిని మనం గుర్తుంచుకోవాలి’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *