పెరిగిన గోప్రాధాన్యం … ఒక్కొక్కరిదీ ఒక్కో అనుభవం… గో సేవ ఫలితాలివి

భూమాతే గోమాత రూపంలో సంచరిస్తుందని పురాణ వచనం. గోమూత్రం, గోమయం పడగానే భూమి పులకరిస్తుందని చెబుతారు. పంటలకు కావాల్సిన 300 కోట్ల సూక్ష్మ జీవులను ఆవుపేడ పుట్టిస్తుందని అనేక మంది రైతుల స్వానుభవం. అనారోగ్యలను పారదోలడానికి గోమాత ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆర్థిక అభివృద్ధికి, పాడిపంటల వికాసానికి, ఆరోగ్యవంతమైన, రోగరహిత సమాజ నిర్మాణానికి మన దేశీ గోవుల పాత్ర తక్షణ అనుసరణీయం.

గ్రామ వికాస ప్రయోగం

సిద్ధగిరి క్షేత్రం కన్హేరీ స్వామీజీ గోవుల ఆధారంగా కొన్ని దత్తత గ్రామాల చిత్రాల్నే మార్చేశారు. గోబర్‌ గ్యాస్‌ ప్లాంట్లు, వంట గ్యాస్‌, విద్యుత్తును ఉత్పత్తి చేశారు. గో ఆధారిత వ్యవసాయం ద్వారా రసాయనాలు లేని అమృతాహారాల ఉత్పత్తి, పాలు, పెరుగు, నెయ్యి వాడకం ద్వారా అక్కడ చాలా మంది సంపూర్ణ ఆరోగ్యులుగా వున్నారు. సామూహిక, సమరసత జీవనం ద్వారా పోలీసు, కోర్టులు అవసరం లేని సామాజిక స్థితిని సాధించారు.
ఆరోగ్యం.
1. నిర్మల్‌ జిల్లా కంజెర్ల గ్రామంలో నిమ్మ ముత్యం అనే వ్యక్తి ఫిస్టులా వ్యాధితో చాలా కాలం నుంచి బాధపడుతున్నాడు. ఆవు పాలలో నిమ్మకాయ రసం పిండుకొని 3 రోజులు తాగడం వల్ల ఆ వ్యాధి మాయమైందని తెలిపాడు.
2. చింతల్‌ చాందా గ్రామంలో సాయి కిరణ్‌ నెల రోజుల పాటు ఆవు పాలు తాగి తనను దీర్ఘకాలంగా బాధిస్తున్న గజకర్ణిని తగ్గించుకున్నాడు.
3. ఆదిలాబాద్‌ దగ్గర గూడా గ్రామంలోని రమేష్‌ ద్వారా ఆవు పాలు, నెయ్యి వంటి పంచగవ్యాలు స్వీకరించి ఆదిలాబాదు మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ తన ఒంట్లో క్యాన్సర్‌ తగ్గిపోయిందని తెలిపాడు.
4. కామారెడ్డి జిల్లా శాంతాపూర్‌ గ్రామంలో సాయిరాం అనే దంపతులు ఒక యేడాది ప్రతి రోజు గోమాత పూజ చేయడం వల్ల సంతాన భాగ్యం కలిగింది.
5. గాంధారి గ్రామంలో శివాజీ రావు అనే వ్యక్తి 3 నెలలు గోమూత్రం సేవించడం వల్ల 8 కిలోల బరువు తగ్గినట్లు తెలిపాడు.
6.పిట్లంలోని బండేపల్లి తండాలో మానుకోట సరిత్‌చంద్‌ పక్షవాంతో నోరు వంకరపోయింది. కొన్ని నెలలు నిత్యం ఆవు పాలు తాగడం వల్ల పక్షవాతం నయమై, ఆరోగ్యంగా మారాడు.
7. సంవత్సరం పాటు గోవుల సాహచర్యంతో ఉబ్బసం తగ్నివారు, సంవత్సరం పాటు గుమ్మపాలు తాగి టీబీ పొగొట్టుకున్న వారు, ఇలా అనేక సందర్భాలలో పంచామృతాలు, పంచగవ్యాల ప్రాశస్త్యాన్ని తెలియజేస్తున్న సంఘటనలివి.

గో` సేవా ఫలము
నిర్మల్‌ జిల్లా భైంసా వద్ద వాలెగామ్‌లో (100 ఆవులు), ఇందూరు జిల్లా మోర్తాడ్‌ వద్ద తిమ్మాపురంలోని గోశాలలోని ఆవులు నిరపరాధులైన గోపోషకులను పోలీసులు అరెస్టు చేయకుండా యజమానులను కాపాడిన ఘటన ఆశ్చర్యపరిచింది. పోలీసులు గ్రామం నుంచి వెళ్లే వరకు ఆ రోజు ఇంటికి రాకుండా విచిత్రంగా ప్రవర్తించాయి. గోవులను పోషిస్తున్న అనేక మంది తమకు ఎల్లప్పుడూ విజయమే చేకూరుతుందని, వెనక్కి చూడాల్సిన అవసరం లేదని తెలిపారు.

విశేషంగా జరిగిన ప్రయోగాలు
1. 2016`17 లో నిర్మల్‌లో పూర్తిగా ఆవు పేడతో 6 అడుగుల వినాయక విగ్రాఇ్న తయారు చేసి, పూజలు చేశారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి దీనిని సందర్శించి, విశేషంగా పూజలు చేశాఉ.
2. నిజామాబాద్‌ దగ్గర మక్లూర్‌ గ్రామంలో పాండురంగ గత 10 సంవత్సరాలుగా తన గోవులతో తయారు చేస్తున్న గోబర్‌ గ్యాస్‌ ప్లాంటు ద్వారా అధిక గ్యాసు పొందుతున్నారు.
3. సైదాపురం స్వామి బోధానందగిరి గోశాలలో ఎయిడ్స్‌కు చికిత్స చేశారు. దీంతో ఆయనకు చెన్నై జియోలాజికల్‌ ఓపెన్‌ యూనివర్శిటీ ఆరో స్నాతకోత్సవంలో స్వామికి గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేశారు.
4. అదితి ఫార్మ్స్‌ పోచంపల్లి, ప్రజ్ఞాపూర్‌ గోశాలలో ఒక్కో ఆవు 10`18 లీటర్లు పాలు ఇస్తున్నాయి.
5. కొన్ని గోశాలల్లో గోవు చనిపోయిన తర్వాత గో సమాధితో ఎరువు తయారు చేసి 10`12 ఎకరాలకు సరిపోయే 4 లక్షల విలువ గల సుగంధ భరిత ఎరువును పొందుతున్నారు. ఎద్దుకొమ్ము ఒక ఎకరాకు ఎరువు అన్న నానుడిగా రెండు కొమ్ములతో 2 ఎకరాలకు సరిపోయే ఎరువు లభిస్తుంది.
6. ఆవు ఈనిన తర్వాత పుట్టిన దూడ మొదట వేసే పేడ విలువ కట్టలేనన్ని ఔషధ గుణాల్ని కలిగి వుంటుంది. ఈ పేడ కేన్సర్‌, ఫిట్స్‌ వంటి వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
7.పుట్టే పిల్లలు చురుగ్గా ఉండాలంటే సాయంత్రం వెండి గిన్నెలో ఆవుపాలు తోడుపెట్టి మరుసటి రోజు గర్భవతికి తినిపించాలి. 5వ నెల నుంచి పుట్టబోయే సంతానంపై చాలా ప్రభావం వుంటుంది.

గో ఆధారిత వ్యవసాయం
నిర్మల్‌లో రిటైర్డు వ్యవసాయ అధికారి నారాయణ రెడ్డి 40 సంవత్సరాలుగా రసాయనలేని గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు. తన వద్ద 9 సంవత్సరాల గోమూత్రం నిల్వ వుందని ఆయన తెలిపారు. ఏకలవ్య ఫౌండేషన్‌, గ్రామ భారతి వంటి సంస్థలు కొన్ని వందల మంది రైతుల్ని రసాయనాలు లేని గో ఆధారిత వ్యవసాయం చేసేందుకు శిక్షణ ఇస్తున్నాయి. ఒక్క ఆవు ద్వారా 30 ఎకరాలు సాగుచేస్తూ అధిక దిగుబడిని పొందుతున్నారు. జీవామృతం, బ్రహ్మాస్త్రం వంటి కీటకనాశినులతో లాభసాటి వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు.

జాతి గోవుల పెంపకం
కర్నూలు మురళీధర్‌ రెడ్డి విశ్వశాంతి పరమేశ్వరి గోశాల పార్వతీపురం, శ్రీ గోకులంగోశాల సంగారెడ్డి, అదితి ఫార్మ్స్‌, పోచంపల్లి వాత్సల్య వంటి గోశాలలు ఒంగోలు, గిర్‌, సాహిపాల్‌, పుంగనూర్‌, కాక్రీల్‌ వంటి మేలుజాతి, అధిక పాల దిగుబడినిచ్చే 6 నుంచి 12 రకాల గోజాతులను పెంచుతున్నారు. ఒక ఒంగోలు కోడెను కర్నూలు గోశాల 10 నుంచి 25 లక్షలకు అమ్ముతున్నట్లు చెబుతున్నారు.
ఈ విధంగా గో ఆధారిత వ్యవసాయంతో అనేక ఉత్పత్తులను పొందుతూ రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. గోశాలల నిర్వాహకులు, గోపోషకుల భక్తి, శ్రద్ధ, ప్రేమలతో గోసేవ ఫలితాలు పొందుతూ, మధుర అనుభూతులూ పొందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *