‘భారత్‌ అవసరం ప్రపంచానికి ఉంది’

ప్రతిష్టాత్మక జి20 అధ్యక్ష పదవిని డిసెంబర్‌ 2022 నుంచి భారతదేశం చేపట్టింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 26న ఫోరమ్‌ ఫర్‌ నేషనలిస్ట్‌ థింకర్స్‌ సంస్థ హైదరాబాద్‌లోని హోటల్‌ మారియట్‌ ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భారత విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌. జైశంకర్‌ ప్రధాన వక్తగా హజరై ప్రసగించారు. గౌరవ అతిథులుగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి జి. కిషన్‌రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సీనియర్‌ న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు అధ్యక్షత వహించారు.

విదేశాంగమంత్రి డా.ఎస్‌.జైశంకర్‌ ప్రధానోప న్యాసం చేశారు. హైదరాబాద్‌లో సుమారు ఆరు జి20 సమావేశాలు జరుగుతాయి. జి20 అనేది ప్రస్తుతం మన దేశంలో ప్రాధాన్యత పెరుగుతున్న అంశం. ఆర్థిక మంత్రుల బృందం, విదేశాంగ మంత్రుల బృందం వంటి అనేక బృందాలు జి20లో శిఖరాగ్ర స్థాయి సమావేశాల్లో భాగం కానున్నాయి. భారతదేశం జి20 అధ్యక్ష పదవి డిసెంబర్‌ 2021లో ప్రారంభమైంది. ప్రపంచానికి సమన్వయ దృష్టి, కచ్చితమైన ఆలోచన విధానం అవసరం కాబట్టి భారత్‌ అధ్యక్షత సందర్భోచితమైనది.

భారతదేశంతో పోల్చితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్‌ ప్రభావం చాలా ప్రతికూలంగా ఉంది. ఒక దేశంపై అతిగా ఆధారపడటం సరికాదని ప్రపంచం గ్రహించింది. నేడు ప్రపంచం వైవిధ్యభరితంగా మారడానికి ప్రయత్నిస్తోంది. మొత్తం భూగోళంలో అప్పుల పరిస్థితి కూడా ప్రమాదకరంగా ఉంది. ఆర్థిక, ఆహార, ఆరోగ్య భద్రతా సమస్యలు కూడా ఉన్నాయి. జి20 ఈ సమస్యలను నిశితంగా పరిశీలిస్తుంది. ఉక్రెయిన్‌ సంక్షోభ సమయంలో ఇతర దేశాలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ భారతదేశం ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉన్నప్పటికీ, ఇంధనం, ఎరువులు ఆహార ధరలను తగ్గించింది.

కరోనా మహమ్మారి ఆర్థికంగానే కాకుండా ప్రజల మానసిక స్థితిని కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. వాతావరణ మార్పు, ఉగ్రవాద సమస్యలు జి20లో పరిష్కరించాల్సిన అంశాలు. సాంకేతికత ఒక సమస్యగా మారింది. కృత్రిమ మేదస్సు దానికి సంబంధించిన నష్టాలు పూర్తిగా తెలియదు కాబట్టి నమ్మకం పారదర్శకత ముఖ్యం. భారతదేశంలో జన్‌ ధన్‌, డిజిటల్‌ ఎకానమీ వంటివాటిపై డిజిటల్‌ సాంకేతికత ప్రభావం మంచి పరిణామాలను చూపింది. జి20 అధ్యక్ష పదవిని ఉన్నతంగా నిర్వహించేందుకు భారత్‌ సిద్ధమైంది. దేశంలోని 56 నగరాల్లో దాదాపు 200 సమావేశాలు జరగనున్నాయి. గ్లోబల్‌ సౌత్‌ నుండి మరో 9 దేశాలు కూడా ఇందులో భాగం కానున్నాయి. జి20 ద్వారా భారతదేశాన్ని ప్రపంచానికి, ప్రపంచాన్ని భారతదేశానికి అర్థమయ్యేలా, ప్రపంచంతో భాగస్వామిగా ఉన్న మార్గాలను తెలుసుకునే విధంగా సిద్ధమవుతున్నాం.

 రాజకీయంగా భారతదేశం ప్రపంచ స్థాయిలో తన ప్రభావాన్ని చూపుతుంది. ప్రపంచ మనుగడలో ఉన్న ఏకైక పురాతన నాగరికత భారతదేశానిదే, కాబట్టి మన సంప్రదాయాలు సంస్కృతిని ప్రపంచ జీవన విధానంలో భాగంగా చేసుకోవడం మనపై ఆధారపడి ఉంటుంది. దీనికి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒక గొప్ప ఉదాహరణ. ఇది ప్రారంభ మైన కొద్ది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా యోగాను పాటిస్తున్న వారి సంఖ్య పెరిగింది. ఆయుర్వేదం వంటి సాంస్కృతిక ఔషధం కూడా ప్రపంచమంతా ఎగుమతి అవుతోంది. మనం భారతదేశాన్ని ప్రపంచం కోసం సిద్ధం చేయాలి.

 కోవిడ్‌ వ్యాక్సిన్‌ల ఆవిష్కరణ నుండి, రోల్‌ అవుట్‌ స్థాయి వరకు, కోవిడ్‌ సర్టిఫికేట్‌ల కోసం డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ అభివృద్ధి ప్రోగ్రామ్‌ల డిజిటల్‌ డెలివరీ వరకు అన్నీ ప్రపంచాన్ని భారతదేశం వైపు చూసేలా చేశాయి. డిజిటల్‌ డెలివరీ స్థాయి ఆశ్చర్య పరిచింది. 80 కోట్ల ప్రధానమంత్రి గరీబ్‌ అన్నదాన యోజన, 8 కోట్ల ఆవాస్‌ యోజన, గతి-శక్తి మొదలైనవి ప్రపంచాన్ని ఆశ్చర్యపరచాయి. ఈ పథకాల క్రింద లబ్ధిపొందేవారి సంఖ్య అనేక దేశాల జనాభాతో సమానం.

 భారతదేశంలోని నైపుణ్యం కలిగిన యువతపై ప్రపంచం కూడా ఆసక్తిని కలిగి ఉంది. దీనివల్ల భారతదేశంలో అసంఖ్యాక స్టార్టప్‌ల రూపకల్పన జరిగింది. 2008లో 26/11 దాడి, ఇటీవల ఉరీ, బాలాకోట్‌ జరిగిన దాడిని ప్రపంచం కూడా వ్యతిరే కించింది. చైనా గాల్వాన్‌ ఘర్షణల సమయంలో, కోవిడ్‌ సంక్షోభం మధ్య గడ్డకట్టే ఎత్తులో భారత సాయుధ దళాలను ఉంచడం ప్రపంచం గమ నించింది. సరిహద్దుల్లో మన మౌలిక సదుపాయాలు, రోడ్లు, సొరంగ మార్గాలు అనేక రెట్లు పెరిగాయి. భారత ప్రభుత్వం దృఢ నిశ్చయం, హామీలను నెరవేర్చడం ప్రపంచం స్పష్టంగా గమనిస్తోంది. క్వాడ్‌ (ూఖAణ) 2007లో స్థాపించబడినప్పటికీ, ఇప్పుడు మాత్రమే సక్రియంగా పని చేస్తోంది. ప్రపంచ ఆర్థిక వృద్ధిలో 15% భారతదేశం నుండి వస్తుందని Iవీఖీ డైరెక్టర్‌ ఇటీవల చెప్పారు. సెమీకండక్టర్‌ చిప్స్‌ పరిశ్రమ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. 40% భారత దేశంలోనే ఉంది. ప్రపంచ వృద్ధికి కూడా దోహద పడుతోంది. ఇంటర్నేషనల్‌ సోలార్‌ ఎనర్జీ అలయన్స్‌, ఇంటర్నేషనల్‌ మిల్లెట్స్‌ ఇయర్‌ మొదలై నవి భారతదేశ చొరవ తీసుకున్న కార్యక్రమాలు. టర్కీలో ఇటీవల భూకంపాలు సంభవించినప్పుడు 24 గంటల్లో భారత చీణRఖీ- సహాయ బృందాలు అక్కడికి చేరుకున్నాయి.

ప్రపంచాన్ని ప్రభావితం చేసే గొప్ప అవకాశం భారత అధ్యక్షతన జరిగే జి20 సమావేశాల ద్వారా మనకు లభించింది. భారత్‌లోని గొప్ప ఆలోచనలు ప్రపంచమంతా వ్యాప్తి చెందుతాయి. ఇది ప్రధానమంత్రి దార్శనికత. అందుకే ఏడాది పొడవునా భారతదేశంలో జరుగనున్న జి20 సమావేశాలకు ప్రభుత్వం ప్రజా భాగాస్వామ్యాన్ని కోరుకుంటోంది.’’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *