జల మండలి ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల నిర్మాణంఫై మూడు రోజుల శిక్షణ
హైదరాబాద్‌లో ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్లంబర్లు, మేస్త్రీలకు మూడు రోజుల శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్ జల మండలి ఆధ్వర్యంలో ఇది జరిగింది. శిక్షణ పొందిన వారికి ధ్రువీకరణ పత్రాలు కూడా అందించారు. పదే పదే ట్యాంకర్లను బుక్ చేసుకునే వారి ప్రాంగణాల్లో మొదట ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 30 వేల మందికి సంబంధించిన ప్రాంగణాల్లో ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందుకోసం 18 ఎన్జీవోలు పనిచేస్తున్నారు . ఇప్పటికే 700 మందిని తాము కలిశామని, ఇంకుడు గుంతల ప్రాముఖ్యం, నిర్మాణం, పద్ధతిని తాము వివరించామని అధికారులు తెలిపారు. అయితే… నగరంలో ఇంకుడు గుంతలను నిర్మించుకునే వారికి తామే సాంకేతిక సహాయాన్ని కూడా అందిస్తామని అన్నారు.