ఇది మన భూమి.. సుపోషితం, సుభిక్షం చేద్దాం రండి….
మన భారత దేశం అనాదిగా సమృద్ధమైన, సుసంపన్నమైన ప్రకృతితో అవినాభావ సంబంధం కలిగిన దేశమే కాకుండా తన వ్యవస్థల ఆధారంగా అత్యున్నతమైన వైభవాన్ని సంతరించుకుంది. భారత దృష్టి కోణము ప్రకారంగా సృష్టి, ప్రకృతి మరియూ పరిసర వాతావరణాలు పరస్పర ఆధారితంగా వుంటాయి. ఇలా వుంటూ వాటి మధ్య ఒక విడదీయరాని సంబంధం మనకు కనబడుతుంది. మనం ప్రకృతిని సౌహార్థం, సామరస్యం, సహజీవనంతో పాటూ మాతృభావంతో గౌరవిస్తాం. పర్వతములు, కొండలూ, గుట్టలూ, రాళ్లు, చెట్లు, చేమలూ, పశువులు, పక్షులు, జలచరములు, మానవులూ… అందరూ అన్నీ ఈ భూమి మీదనే వున్నాయి. ఈ అన్నీ సజీవ, నిర్జీవ సముదాయమంతా కలిసి భూమి అవతరించిందే.
ఆ భూమి మనకు మాతృ సమానం. అందుకే మనం భూమిని పుడమి తల్లి అంటాము. తెలిసో తెలియకో మనం తత్వానికి విరుద్ధమైన దోపిడీ దృష్టికోణాన్ని మన దేశంలో అవలంబిస్తున్నారు. ఆ కారణంగా గాలి, నీరు, నేల అతివేగంగా కలుషితం చేసుకుంటున్నాం. ప్రస్తుతం భారత్‌లో 164 హెక్టార్ల భూమి ఎడారులుగా నిస్సారమైన భూమిగా మారుతోందని ఓ నివేదక వచ్చింది. అనగా దాదాపు 30 ధాతం భూమి దేనికీ పనికిరానిదిగా మారుతుంది. ప్రతి సంవత్సరం 15.56 టన్నుల ఆమ్ల క్షారములు భూమిలో పెరుగుతున్నాయి. భారత వ్యవసాయ విజ్ఞాన సంస్థ పరిశోధనా ఫలితాలు వెల్లడిస్తున్నది. ఈ నేపథ్యంలో మనందరి కర్తవ్యం ఒకటుంది.
మన భూమిని మనమే పోషించాలి, రక్షించుకోవాలి. గ్రామ భారతి తెలంగాణ విభాగం, ఋషి జీవన సమాజం మరొక 20 స్వచ్ఛంద సంస్థలు ఈ ఉద్యమాన్ని ముందుకు నడుపుతున్నాయి. ఈ మహత్కార్యం కేవలం ఈ సంస్థల పని మాత్రమే కాదు. ప్రతి మనిషిది కూడా. భూమిని సుపోషితం, సుభిక్షం, సుసంపన్నం చేయడం మనందరి కర్తవ్యం. మనలో ప్రతి ఒక్కరూ ఈ బృహత్కార్యానికి చేయూతనివ్వాలి. మనమందరం కలిసి ఆరోగ్యవంతమైన భారతావనిని ఆవిష్కరించే పనిలో భాగస్వాములమవుదాం.