దేశంలోనే ఎక్కువ పవన విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రాంతం… వ్యవసాయం కూడా ఈ విద్యుత్తుతోనే
సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తులే గాక.. పవన విద్యుత్తు ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అయితే.. పవన విద్యుత్ ఉత్పత్తిలో తమిళనాడు రెండో స్థానంలో వుంది. కన్యాకుమారి జిల్లా గత 40 సంవత్సరాలుగా పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ రికార్డుల్లోకి ఎక్కింది. అలాగే ఇదే జిల్లాలోని అరల్వాయిమొళి కూడా వుంది. దీనిని ముప్పందల్ పవన క్షేత్రం అని పిలుస్తుంటారు. ఈ ఆరల్వాయి మొళి అనే ప్రదేశం అత్యంత గాలులు వీచే ప్రాంతాల్లో రెండో స్థానంలో వుంది. దీంతో పవన విద్యుత్ ఉత్పత్తికి కూడా బాగా పనికొస్తుంది. 1980 నుంచి ఈ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి కోసం టర్బైన్లను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం రికార్డుల్లోకి ఎక్కింది. ఈ ప్రాంతంలో వ్యవసాయ క్షేత్రానికి అవసరమయ్యే విద్యుత్‌ను కూడా ఈ గాలిమరల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తునే వాడుతున్నారు.
రానూ రానూ ఈ గాలిమరల సంఖ్య పెరిగింది. 2000 సంవత్సరం నాటికి దాదాపు 10 వేల గాలిమరలను అమర్చి, విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఈ గాలి మరలు 1600 మెగా వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. తమిళనాడు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్తులో 23 శాతం ఈ ప్రాంతం నుంచే ఉత్పత్తి అవుతుంది. దీంతో పర్యావరణానికి కూడా ఎలాంటి హాని కలగకుండా వుంది. ఇక్కడే వుండే పవన క్షేత్రాలు 50 మెగావాట్ల నుంచి 200 మెగావాట్ల వరకు విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. మే నుంచి సెప్టెంబర్ మాసంలో అత్యధిక మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.