మతమార్పిళ్లకు పాల్పడుతున్న ముగ్గురు స్వీడన్ దేశీయులు అరెస్టు
వీసా నిబంధనలను ఉల్లంఘిస్తూ భారత దేశంలో మత మార్పిళ్లకు పాల్పడుతున్న స్వీడన్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను అస్సాం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ముగ్గురు స్వీడిష్ జాతీయులు టూరిస్ట్ వీసాపై భారతదేశానికి వచ్చి, మత ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నట్లు తేలింది. అరెస్టయిన స్వీడిష్ జాతీయులను హన్నా మైకేలా బ్లూమ్, మార్కస్ ఆర్నే హెన్రిక్ బ్లూమ్, సుసన్నా ఎలిసబెత్ హకనాసన్‌లుగా గుర్తించారు.
అస్సాంలోని టీ గార్డెన్ ప్రాంతాల్లో ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చడానికి వీరు ప్రయత్ని స్తున్నారు.. అక్టోబరు 25 నుండి 27 వరకు ‘‘శాంతి, స్వస్థత ప్రార్థన ఉత్సవం’’ పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలోని ప్రజలను క్రైస్తవ మతంలోకి ఆకర్షించేందుకు వారు ప్రయత్నిస్తు న్నారు. బ్లెస్ అస్సాం మిషన్ నెట్‌వర్క్, యునైటెడ్ చర్చ్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నకర్కటియాలోని అచబామ్ ఘినై 1 నం. ప్లేగ్రౌండ్‌లో ఈ కార్యక్ర మాన్ని నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అరెస్టు చేశారు.
DSP నమరూప్ నబా కుమార్ బోరాహ్ మాట్లాడుతూ, ‘‘ముగ్గురు స్వీడిష్ జాతీయులు నహర్కటియాలో ఒక సమావేశానికి వచ్చారు. వారి పర్యాటక వీసా ప్రకారం వారు ఎటువంటి ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఫారినర్స్ (విదేశీయుల) చట్టంలోని సెక్షన్ 14 నిబంధన ఉల్లంఘన జరిగినందున, కేసు నమోదు చేసి తరువాత అరెస్టు చేశారని ఆయన తెలిపారు. ఈ ముగ్గురిని స్థానిక కోర్టులో హాజరుపరచగా ఫారినర్స్ (విదేశీయుల) చట్టం కింద దోషులుగా నిర్ధారించారు. వారి బహిష్కర ణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగం, పోలీసులను కోర్టు ఆదేశించింది. స్వీడన్ జాతీయులను గురువారం గౌహతికి పంపిస్తామని, ఆ తర్వాత స్వీడన్‌కు పంపిస్తామని ఏఎస్పీ చెటియా తెలిపారు. అనేక చర్చిల సంస్థ యునైటెడ్ చర్చ్ ఫెలోషిప్ నిర్వహించిన ప్రార్థన సమావేశం అధికారుల అనుమతితో జరుగు తోంది. ముగ్గురిని అరెస్టు చేసిన తర్వాత, పెద్ద సంఖ్యలో ప్రజలు, ఎక్కువగా తేయాకు తోటల నుండి, అరెస్టుకు వ్యతిరేకంగా పోలీసు స్టేషన్ వెలుపల గుమి గూడారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడే ప్రార్థనలు ప్రారంభించారు.