అయోధ్య రామమందిరానికి మూడువేల కోట్లకు పైగా విరాళాలు
అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం ప్రజలు రూ.3,000 కోట్లకుపైగా విరాళాలు ఇచ్చినట్లు రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఆలయ ప్రాజెక్టు మొత్తం ఖర్చు దాదాపు రూ.1,800 కోట్లని.. ఇప్పటి వరకూ రూ.1,500 కోట్ల బిల్లులు చెల్లించినట్లు వెల్లడించారు. 2022లో నిర్మాణం కోసం విరాళాలు ప్రకటించినప్పటి నుంచి ఈ మొత్తం వచ్చినట్లు తెలిపారు. మరోవైపు శ్రీరామ జన్మభూమిలో రామాలయ నిర్మాణం పూర్తయింది. ప్రధాన దేవాలయంతో పాటుగా ఇతరదేవాలయాలను కూడా నిర్మించారు. ఇక నవంబర్ 25న ఆలయంలో ధ్వజారోహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామాలయంపై పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. దాదాపు 8 వేల మందికి పైగా ఆహ్వానితులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.