మహారాష్ట్ర సీఎంకి పాక్ నుంచి బెదిరింపు కాల్స్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కి పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. మాలిక్ షాబాజ్ హుమాయున్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పై దాడి చేయబోతున్నామని సందేశం సారాంశం. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ బెదిరింపుతో ముంబైలోని వర్లి పీఎస్ లో కేసు నమోదైంది. బెదిరింపుపై పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు.శుక్రవారం ఉదయం ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ లో బెదిరింపు వచ్చింది. అందులో సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తామని బెదిరింపులకు దిగాడు. ఈ బెదిరింపుల నేపథ్యంల సీఎం, ఆయన కార్యాలయంతో వద్ద భద్రతను పెంచారు. దీనిపై ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించింది. సందేశం పంపిన వ్యక్త ఐపీ చిరునామాను ట్రాక్ చేస్తున్నారు.