నేడు ”గ్రామ భారతి తెలంగాణ” ఆధ్వర్యంలో ఐదు అంచెల వ్యవసాయ పద్ధతిపై క్షేత్ర సందర్శన
గ్రామ భారతి తెలంగాణ వారి ఆధ్వర్యంలో ఐదు అంచెల వ్యవసాయ పద్ధతిపై క్షేత్ర సందర్శన మరియు అవగాహన కల్పించనున్నారు. శుక్రవారం సాయంత్రం 3:00 నుంచి 6:30 గంటల వరకు ఈ సందర్శన, అవగాహన కొనసాగుతుందని గ్రామ భారతి నిర్వాహకులు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామవరం మండలం, రామలింగంపల్లి గ్రామంలో ఈ అవగాహన, సందర్శన జరుగుతుంది. రిజిస్ట్రేషన్ రుసుము 200 రూపాయలు. ఫీజు చెల్లించే విషయంలో 91 9490 850 766 నెంబరుకి ఫోన్‌పే లేదా గూగుల్ పే చేయాలని పేర్కొన్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామ భారతి పిలుపునిచ్చింది. అయితే.. కేవలం 50 మందికి మాత్రమే అవకాశం వుంటుందని తెలిపారు. ఈ రిజిస్ట్రేషన్ ఫీజు కొరకు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికే అవకాశం వుంటుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ నిమిత్తం 9490850766, 9291696249కి సంప్రదించగలరు.
వ్యవసాయాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళాలన్న ఆశయంతో, 12 ఏళ్ళుగా తన కుటుంబంతో సాహా ఉద్దమర్రిలోని తన వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటూ నిరంతరంగా పరిశోధన నిర్వహిస్తున్న బొల్లంపల్లి ప్రసాద్ రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో మీరు నేర్చకోబోయే అంశాలు:
1. ఐదు అంచెల వ్యవసాయ పద్ధతి: 36*36 మోడల్ లో పండ్లు , కూరగాయలు, ఆకుకూరలు, పసుపు , అల్లము మరియు తీగజాతి కూరగాయలు ఎలా పెంచుకోవాలి
2. ఆరోగ్యము, ఆర్థికము: మనం మన కుటుంబ ఆర్థిక వ్యవస్థ ఎలా బలోపేతం చేసుకోవాలి , అలాగే మనకు, మన కుటుంబానికి, నేలకు జరుగుతున్న నష్టం ఏంటి, వాటిని ఎలా అధిగమించాలి అనే విషయాలు తెలుసుకోవొచ్చు
3. అటవీ వ్యవసాయం: నేల తన సహజ వ్యవస్థను కోల్పోకుండా ఉండేట్టు, దున్నకుండా వ్యవసాయం ఎలా చేసుకోవాలి
4. వాన నీటి సంరక్షణ/ వాటర్ హార్వెస్టింగ్: ప్రతి వాన నీటి బొట్టుని మన పొలంలో బోర్వేల్ రిచార్జ్ ద్వారా ఎలా పొదుపు చేసుకోవాలి, తిరిగి దాన్ని వ్యవసాయానికి ఎలా వాడుకోవాలి (రైతు ఆర్థిక పరిస్థితిని బట్టి 3 రకాల నీటి సంరక్షణ వ్యవస్థ)
5. ఒక రైతు తన పూర్తి కుటుంబంతో కలిసి ఖర్చు లేకుండా తన భూమిలో తను వ్యవసాయం ఎలా చేసుకోని మంచి ఫలితాలు పొందొచ్చు
6. కాలం ఏదైనా నేల, ప్రకృతిని, ఉష్ణతను ఎలా మనం కాపాడుకోవచ్చు అనే అంశాలఫై శిక్షణ ఇస్తారు.
మామూలుగా ప్రసాద్ గారు ఈ కార్యక్రమం కొరకు 1000 రూపాయలు తీసుకుంటారు. కానీ మన గ్రామ భారతి స్వచ్ఛంధ సంస్థ కాబట్టి మన రైతుల వద్ద కేవలం 200 రూపాయలు తీసుకోవటానికి ఒప్పుకున్నారు. ఈ కార్యక్రమం వళ్ళ మీకు పూర్తి లాభం చేకూరాలంటె, మీ పూర్తి కుటుంబంతో కలిసి రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.