మావోయిస్టు పార్టీలో భీకర గెరిల్లా దాడుల వ్యూహకర్తగా హిడ్మా…
నక్సల్స్ ఏరివేతలో భద్రతా బలగాలు అతిపెద్ద విజయం సాధించాయి. ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామ రాజు జిల్లా మారేడుమిల్లి ప్రాంంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత, మోస్ట్ వాంటెడ్ మడ్వి హిడ్మా (సంతోష్) హతమయ్యాడు. మరో రకంగా చెప్పాలంటే కేంద్ర హోం మంత్రి అమిత్ షా విధించిన గడువు కంటే కేంద్ర బలగాలు ముందే తమ పనిని పూర్తి చేశాయి. నిజానికి హిడ్మా ప్రస్తుతం నక్సలైట్లకు ఓ వెన్నెముకగా వున్నాడు. ఆ వెన్నెముకను భద్రతా బలగాలు తమ వ్యూహంతో మట్టుబెట్టాయి.
మావోయిస్టు పార్టీలో భీకర గెరిల్లా దాడుల వ్యూహకర్తగా…
హిడ్మాకి భీకర గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా వుండేవాడు. అంతేకాకుండా భద్రతా బలగాలను టార్గెట్ చేయడంలోనూ ముందుండేవాడు. వీటితో పాటు యువతను నక్సలైట్ ఉద్యమం వైపు మళ్లించడంలోనూ అంతే చురుగ్గా వుండేవాడు. నక్సలైట్లలో మోస్ట్ వాంటెండ్ గా గుర్తింపబడ్డాడు కూడా.ఈ ఏడాది హిడ్మా సీపీఐ (మావోయిస్ట్) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKZC) సెక్రటరీగా పదోన్నతి పొందినట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. హిడ్మాను పట్టుకోవడం కోసం పోలీసులు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అతడి ఆచూకీ తెలిపిన వారికి బహుమతులు కూడా ప్రకటించారు. అడవుల భౌగోళిక పరిజ్ఞానం, గెరిల్లా యుద్ధ వ్యూహాలు, స్థానిక నెట్‌వర్క్‌లను ఉపయోగించడంలో హిడ్మా సిద్ధహస్తుడు.
పీపుల్స్ లిబరేషన్ గెరిల్లీ ఆర్మీ బెటాలియన్ కి నేతృత్వం…
హిడ్మా అత్యాధునిక ఆటోమేటిక్ ఆయుధాలను వినియోగించే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ నంబర్ 1 కి నేతృత్వం వహిస్తుంటాడు. ఈ బెటాలియన్ లో దాదాపు 350 మంది దళ సభ్యులుంటారు. భద్రతా బలగాలపై దాడులు చేసిన తర్వాత, అత్యాధునిక ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను సేకరించడం,ఎత్తుకెళ్లడం, ఆ తర్వాత వీటిని ఎక్కువగా వాడటంలో ఈ గెరిల్లా ఆర్మీ ముందుంటుంది. అంతేకాకుండా హిడ్మా గనక నేతృత్వం వహించి, దాడులకు దిగితే.. అతి తక్కువ నష్టం మావోయిస్టులకు వుంటుందని, అందుకే హిడ్మాను నేతృత్వం వహించేలా వ్యూహ రచన చేస్తుంటారన్న ప్రచారమూ వుంది.
దండకారణ్యంలో నక్సలైట్లు ఏవైనా దాడులు చేయాలంటే మావోయిస్టు పార్టీ కచ్చితంగా హిడ్మానే నాయకత్వం వహించాలని ఆదేశాలిచ్చేది. ఇతడి ప్రమేయంతోనే దండకారణ్యం ప్రాంతాల్లో దాడులు జరిగాి. చింతల్నార్, డోర్నాపాల్ లాంటి ఆపరేషన్లలో హిడ్మా స్వయంగా పాల్గొని, 200 మందికి పైగా పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోవడంలో హిడ్మా పాత్రే వుంది. పోలీసు బలగాలపై, సీఆర్పీఎఫ్ బలగాలపై మెరుపు దాడులు చేయడంలో హిడ్మా కీలకంగా వుంటాడని, పార్టీలో పరిశోధన, దాడుల వ్యూహం అంతా హిడ్మాయే చూస్తుంటాడని కూడా అంటుంటారు.
ఆయనది ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని పునర్తి గ్రామం. హిందీ, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ భాషల్లో హిడ్మాకు పట్టు ఉంది. హిడ్మా దళానికి అత్యంత శక్తివంతమైన దళంగా పేరుంది. భారీ ఆపరేషన్లలో హిడ్మాదే మాస్టర్ మైండ్. భారీ దాడుల్లో స్వయంగా పాల్గొంటూ కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్‌గా హిడ్మా మారాడు. హిడ్మాపై రూ.కోటికి పైగా రివార్డ్, హిడ్మా భార్య హేమపై రూ.50 లక్షల రివార్డ్ ఉంది. ఈ ఎన్కౌంటర్ లో ఆయన భార్య కూడా మరణించింది.
26 దాడుల్లో కీలక నిందితుడు హిడ్మాయే…
పూర్తి పేరు మడివి హిడ్మా.. ఆయన మొత్తం 26 దాడుల్లో కీలక నిందితుడు. 2007 లో సుక్మా జిల్లా ఉర్పల్మెట్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసి, హతమార్చాడు. 2010 లో తడ్మెట్ల మెరుపుదాడిలో 76 మంది జవాన్లు మృతి చెందారు. 2013 లో జీరామ్ ఘాటీ దగ్గర కాంగ్రెస్ నేతలను ఊచకోత కోశారు. 2017 ఏప్రిల్లో సుక్మా జిల్లాలో 27 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చాడు. 2021 ఏప్రిల్ 4 వ తేదీన బీజాపూర్ జిల్లా తరెంలో హిడ్మా వ్యూహంలో చిక్కుకుని 23 మంది జవాన్లు మృతి చెందారు.
అలాగే 2010 లో దంతెవాడలో జరిగిన దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అలాగే 2013 లో జైరామ్ ఘాటీలో జరిపిన మెరుపుదాడిలో 27 మంది మరణించగా, అందులో కొందరు కాంగ్రెస్ నేతలు కూడా వున్నారు. అంతేకాకుండా 2021 లో సుక్మా బీజాపూర్ లో జరిగిన మెరుపుదాడిలో 22 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.2018 మార్చిలో సుక్మా జిల్లా కాసారం అటవి ప్రాంతంలో మందుపాతర పేల్చిన ఘటనలో 12 మంది జవాన్లు చనిపోయారు. ఇలాంటి అనేక ఘటనల్లో హిడ్మా ఉన్నారు.
17 ఏళ్ల వయస్సులోనే ఉద్యమంలోకి…
మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితుడైన హిడ్మా… 17 సంవత్సరాల వయస్సులోనే మావోయిస్టు ఉద్యమం వైపు వెళ్లిపోయాడు. మురియా తెగకు చెందిన హిడ్మాకి ఇంగ్లీష్, హిందీ, గోండీ, తెలుగు, కోయ భాషల్లో బాగా పట్టుందని అంటుంటారు. దండకారణ్యంలో ప్రతి మూల కూడా హిడ్మాకి క్షుణ్ణంగా తెలుసు. అలాగే అడవుల్లో వుండే కేంద్ర బలగాలపై గెరిల్లా దాడులు చేయడంలో ముందుంటాడు. ప్రతి భారీ దాడిలో స్వయంగా పాల్గొంటాడు. దీంతో కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెండ్ అయ్యాడు. హిడ్మా దూకుడ్ని చూసి కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు. కనీసం పదో తరగతి కూడా చదవని హిడ్మా… ఆదివాసీ తెగకి చెందిన వ్యక్తి కావడంతో గిరిజన ప్రజల్లో కలిసి పోయి, ఉద్యమాన్ని నడిపించాడు. అంతేకాకుండా అక్కడి ప్రజలతో కలిసే బలమైన ఇంటెలిజెన్స్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేసుకున్నాడు.