సద్గుణాలే సంపద
దుష్ట స్వభావము, దయలేని అంతఃకరణము, ద్వేషం, మరియు క్రూరత్వం గల పురుషుడు శ్రేష్ఠ వంశము నందు జన్మించినను విలువ ఉండదు. సద్గుణముల వలన మాత్రమే వ్యక్తికి ఔన్నత్యము కలుగును. బాహ్యముగా ఇత్తడి, బంగారము ఒకే రంగులో ఉన్నప్పటికి కాలక్రమములో ఇత్తడి నల్లగా మారును. బంగారము మాత్రము యధాస్థితిలో ఉండును. ఇదే విధముగా మానవునిలో గల గుణ దోషములవలన మాత్రమే యోగ్యత నిర్ణయించబడును.
– సంత్ తుకారాం