సుగుణాలే దైవసంపద
క్రౌర్యం, అహంకారం, అసూయ, లోభం, మదం, మాత్సర్యం, నిర్లక్ష్య భావన ఉన్న శరీరం భగవంతుడికి నివాస యోగ్యం కాజాలదు. భౌతిక సుఖాలతో పెనవేసుకుపోవటం గాఢాంధకారపు కాళరాత్రిలో గడపటం లాంటిది. అటువంటి అంధకారం కేవలం గబ్బిలాలు ఆహ్లాదం కలిగిస్తుంది. భగవంతుడి దివ్య తేజస్సు ఆ హృదయాలలో ప్రసరించదు. ఓ శ్రీరామా! నీ పాద పద్మములు దర్శించినంతనే నీ కృపా కటాక్ష వీక్షణములు ప్రసరించి హృదయం సత్ సంకల్పములతో పునీతమవుతుంది.
– సంత్ తులసీదాసు