మలేరియా జ్వరానికి తులసి చికిత్స

మలేరియా జ్వరం వర్షాకాలంలో విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. దీనికి ఇతర వైద్యులు క్వినైన్‌ ‌మందుగా వాడటం జరుగుతుంది. దీనివల్ల జ్వరం తగ్గుతుందికానీ తలనొప్పి, వికారం, చెవుడుతో సహా  హృదయసంబంధ సమస్యలవంటివి మిగిలిపోతాయి. తులసి ద్వారా ఎటువంటి కొత్త సమస్యలు రాకుండా ఈ జ్వరాన్ని సులభంగా నివారించవచ్చు.

–  7 మిరియాలు , 7 తులసి ఆకులు కలిపి  3రోజులు తీసుకుంటే  మలేరియా జ్వరం నయమవుతుంది.
–  మానిపసుపు , పిప్పిళ్ళు , వెల్లుల్లి , జీలకర్ర, శొంఠి, తులసి, నారింజ పిందెలు, వావిలి వ్రేళ్లు, ఆకుపత్రి వీటిని సమాన భాగాలుగా కలిపి పొడి చేసి పూటకు అరతులం చొప్పున ఇస్తే చలిజ్వరాలు తగ్గుతాయి.
–  తులసి ఆకులు 60 గ్రా , కొద్దిగా మందార పుష్పదళాలు, కొద్దిగా ఉమ్మెత్త పుష్పదళాలు , మిరియాలు 10 గ్రా , కొద్దిగా నీరువేసి మరిగించి  బఠాణి గింజంత పరిమాణంతో మాత్రలు చేసి చలిజ్వరం వస్తుందనే అనుమానం కలిగినప్పుడు గంట ముందుగా రెండు మాత్రలు తీసుకుంటే అది రాకుండా నివారించవచ్చును.
– ప్రతిరోజు 2 చెంచాల తులసి రసం తీసుకోవడంవల్ల టాబ్లెట్‌ అవసరం లేకుండా రక్తపోటు 170 నుంచి 130 కి తీసుకొనివచ్చన్నది నా స్వీయ అనుభవం. కేవలం 2 వారాలలోనే  ఇలా కొంతకాలం తులసిరసం వాడటం వలన రక్తపోటు సమస్య పూర్తిగా పోతుంది.

– ఉష పప్పు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *