”టూ బ్రదర్స్ ఆర్గానిక్ ఫాం” అన్న పేరుతో యేడాదికి 13 కోట్ల ఆదాయం… స్ఫూర్తి నింపుతున్న సోదరులు
సత్యజిత్, అజింక హంగే … ఇద్దరూ అన్నదమ్ముల్లు. మంచి ఐటీ కంపెనీలలో ఉద్యోగాలను వదులుకొని, ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. తాము పండించిన ఆర్గానిక్ ఉత్పత్తులను దేశ, విదేశాలలోనూ అమ్ముతున్నారు. పూణే యూనివర్సిటీ నుండి ఇద్దరూ ఎంబీయే పూర్తి చేసారు. ఇలా జీవితాంతం ఉద్యోగాలు చేసినా, తమ ఊరికి ఏమి చేయలేమని డిసైడ్ అయ్యారు. వీరిది పూనే లోని భోదనిజిల్లలొని ఇందాపూర్ గ్రామం. వీరి తండ్రి వ్యవసాయదారు. కాని ఈ ఇద్దరు అన్నదమ్ముల్లు ఎప్పుడూ చేనులోకి వెళ్ళలేదు. లక్షల్లో జీతాలు వచ్చే ఉద్యోగాలను వదులుకొని, ఆర్గానిక్ వ్యవసాయం చేస్తామని అంటే.. ఎవ్వరూ ఒప్పుకోలేదు. పిచ్చి ఆలోచన అని వారిని హేళన చేసారు. కాని.. ఇద్దరు సోదరులు మాత్రం, ఆర్గానిక్ వ్యవసాయం వైపే వెళ్ళాలని అనులున్నారు. ఇంతకూ ముందు.. దేశం లోని కొన్ని ప్రాంతాలను వారు తిరిగారు.ఆర్గానిక్ వ్యవసాయం గురుంచి అడిగి తెలుసుకున్నారు. అలాగే వ్యవసాయం గురించి కూడా తెలుసుకున్నారు. సంప్రదాయ వ్యవసాయం లో ఉన్న లోపాలను అధ్యయనం చేసారు. దానిలో వచ్చే ఇబ్బందులను చూసారు. అందుకే ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనీ అనుకున్నారు.. మొదట చిన్న ప్లాట్ లో ఆర్గానిక్ ప్రారంభించారు. ఇప్పుడు ఏకంగా 21 ఎకరాల్లో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు.
టూ బ్రదర్స్ ఆర్గానిక్ ఫాం అన్న పేరుతో….
టూ బ్రదర్స్ ఆర్గానిక్ ఫాం అన్న పేరుతో 2014 లో ఏకంగా సంస్థను స్థాపించారు. అలాగే ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న వారితో మాట్లాడారు. ఆ తర్వాతే ముందగుడు వేసారు. ఆవు పేడను ఎరువుగా వాడడం ప్రారంభించారు. దీని ద్వారా నెలకి అవసరమైన సూక్ష్మ, స్థూల పోషకాలు ఆడుతున్నాయని గ్రహించారు. దీనికి తోడుగా పాలి క్రోపింగ్ పధ్ధతి ద్వార నేల సంతాన ఉత్పత్తి, నేల కణాల పరిమాణం, నీటిని ఆపుకునే సామర్థ్యం పెంచడం లో ఉపయోగ పడుతుందని కూడా గ్రహించారు. ఈ ప్రయోగాల తర్వాత వివిధ రకాల ఫలాలను పండించడం, కూరగాయలను పండి స్తున్నామని సోదరులు ప్రకటించారు. ఇవే కాకుండా ఔషధ మొక్కలను కూడా పండిస్తున్నారు.
మొదట బొప్పాయితో ప్రారంభం ……. సొంత ఎరువుల ద్వారా
ఆర్గానిక్ పద్హతి లో మొదట బొప్పాయి పండు తో ప్రారంభించారు. అయితే పండు బయటి రూపం అంతగా బాగోలేదు. కాని దాని రుచి మాత్రం బాగా ఉందని కొనుగోలుదారులు పేర్కొన్నారు. పండు రూపం బాగోలేదని మార్కెట్లో కూడా వీరికి ఎదురు దెబ్బ తగిలింది. దీనితో, వారే టూ బ్రదర్స్ ఆర్గానిక్ ఫాం అన్న పేరుతో…. ఓ సంస్థనే స్థాపించారు. దీని ద్వార మార్కెటింగ్ చేయడం ప్రారంభించారు. వివిధ షాపుల్లోకి కూడా సరఫరా చేస్తున్నారు. అలాగే ఆన్ లైన్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారు. అలాగే సొంతంగా ఎరువులను తాయారు చేయడం, పురుగు మందులను కూడా రూపొందించుకున్నారు. దీనితో… వారి ఖర్చులు కూడా తగ్గించుకున్నారు. మరో వైపు.. మార్కెట్ లో ఆర్గానిక్ ఉత్పత్తులఫై అవగాహనా కూడా పెంచుతున్నారు.
ఇతర దేశాలకూ ఉత్పత్తులను పంపుతున్న సోదరులు….
సోదరుల సక్సెస్ ని చుసిన తర్వాత 14 దేశాల వాళ్ళు వీరి ఫాంహౌస్ ని చూడడానికి వస్తున్నారు. ఆర్గానిక్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ఆర్గానిక్ వ్యవసాయం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. వీరితో పాటు అక్కడు రైతులు , మీడియా వాలు కూడా వస్తున్నారు. ముఖ్యంగా అమెరికా, ఫ్రాన్స్ , జర్మనీ, ఆస్ట్రేలియా నుండి చూడడానికి వస్తున్నారు. ఇప్పటి వరకు 25, 000 మంది రైతులకు ఆర్గానిక్ వ్యవసాయం మీద ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు.ఆర్గానిక్ వ్యవసాయం చేయడం, అధిక ఉత్పత్తులను సాధించడం ఎలా అన్న దానిఫై శిక్షణ ఇస్తున్నారు. మామూలు వ్యవసాయం చేసే రైతులను కూడా ఆర్గానిక్ వ్యవసాయం వైపు మళ్ళిస్తున్నారు.
లడ్డూలు, నెయ్యి, చ్యవంప్రాష్ తయారీ…
ప్రస్తుతం, వీరిద్దరూ లడ్డూలు, గుల్కంద్, చ్యవాన్‌ప్రాష్, నెయ్యి, వేరుశెనగ వెన్న, వేరుశెనగ నూనె, సాంప్రదాయ గోధుమ పిండి, జొన్న రకాలు మరియు పోషకాలు అధికంగా ఉండే బియ్యం మరియు పప్పులతో సహా పలు రకాల ఆర్గానిక్ వస్తువులను విక్రయిస్తున్నారు. ఇదంతా ఆన్లైన్ ద్వారా చేస్తున్నారు. ఇలా.. యేడాదికి 13 కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు.