తేనెలోని రకాలు
– అర్ఘ్యమను తేనె – చాద్ర అనే తేనె – చిన్ని పువ్వు తేనె – జిద్దాల అనే తేనె – జుంటి తేనె – దండజం అనే తేనె – పుట్ట తేనె – పాత్రికం అనే తేనె – పౌష్పికం అనే తేనె – భ్రామరం అనే తేనె – మాక్షికం అనే తేనె – సౌషిరం అనే తేనె – క్షౌద్రం అనే తేనె – సామాన్యపు తేనె
తేనె తియ్యగా రుచిగా ఉండి వేడి పుట్టించి శరీరంను ఆర్చును. త్రిదోషాలను హరించును. విరేచనం, బలమును కలిగించును. హిక్కా, శ్వాస, కాస, వమనము, పిత్త సన్నిపాత రోగములు, విషదోష, విదాహం, చర్ది, రక్తపిత్తము, కుష్ఠు, అతిసారం, శీతపిత్తము, పక్షవాతం, మలమూత్ర బద్దకం, కంటిజబ్బులు, అశ్మరీ, మూత్రాశ్మరీ మొదలగు సమస్యలను నివారించును.
సాధారణముగా మన వైద్యులు వాడు మందులలో తేనెని అనుపానంగా ఇవ్వడం జరుగును. దీనిని వైద్యుడు తన యుక్తిని అనుసరించి శాస్త్రానుభవసారముగా దీనిని ఉపయోగించినచో అనేక రోగాలు పుట్టుటకు కారణం అగును. కనుక దీనికి విరుగుళ్లు తెలుసుకుని ఉండవలెను . తేనెకి విరుగుడు వస్తువుగా నెయ్యి, నిమ్మకాయ, మాదీఫలము, ధనియాలు, దానిమ్మకాయ అను వీనిలో ఏదైనా ఒకటి తీసుకుని సేవించిన ఉపశాంతి కలుగును. తేనె వ్రణములను, గాయములను మాన్పును.
– ఉషాలావణ్య పప్పు